AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023: వరుసగా 6 విజయాలు.. ఖరారు కానీ భారత్ సెమీస్‌ బెర్తు.. ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?

వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో విజయం. అయితే రోహిత్‌ సేనకు ఇంకా సెమీఫైనల్‌ బెర్తు ఖరారు కాలేదు. దీనికి కారణమేంటంటే.. ప్రస్తుత ప్రపంచకప్‌ టోర్నీ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో ఈ ప్రపంచకప్‌ జరుగుతోంది. ఒక్కో జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుంది. తద్వారా నేరుగా సెమీ ఫైనల్ బెర్త్ సాధించాలంటే కనీసం

World Cup 2023: వరుసగా 6 విజయాలు.. ఖరారు కానీ భారత్ సెమీస్‌ బెర్తు.. ఇంకా ఎన్ని మ్యాచ్‌లు గెలవాలంటే?
Team India
Basha Shek
|

Updated on: Oct 30, 2023 | 6:36 AM

Share

వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది భారత జట్టు. వరల్డ్‌ కప్‌లో టీమిండియాకు ఇది వరుసగా ఆరో విజయం. అయితే రోహిత్‌ సేనకు ఇంకా సెమీఫైనల్‌ బెర్తు ఖరారు కాలేదు. దీనికి కారణమేంటంటే.. ప్రస్తుత ప్రపంచకప్‌ టోర్నీ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో ఈ ప్రపంచకప్‌ జరుగుతోంది. ఒక్కో జట్టు 9 మ్యాచ్‌లు ఆడనుంది. తద్వారా నేరుగా సెమీ ఫైనల్ బెర్త్ సాధించాలంటే కనీసం 7 మ్యాచ్‌లు తప్పక గెలవాలి. టీమ్ ఇండియా తదుపరి మ్యాచుల్లో శ్రీలంక, దక్షిణాఫ్రికా, నెదర్లాండ్స్ తో తలపడనుంది. కాబట్టి ఈ మూడు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో విజయం సాధిస్తే 7 విజయాలతో టీమిండియా ఖాతాలో 14 పాయింట్లు చేరుతాయి. దీంతో సెమీఫైనల్ ఆడనున్న నాలుగు జట్లలో చోటు దక్కించుకోవడం ఖాయం. ఎందుకంటే ఇప్పటి వరకు చాలా జట్లు 6 మ్యాచ్‌లు ఆడేశాయి. అయితే టీమ్ ఇండియా తప్ప, ఏ జట్టు 12 పాయింట్లు సంపాదించలేదు. మిగతా జట్ల విషయానికొస్తే.. 6 మ్యాచ్‌ల్లో 5 గెలిచిన దక్షిణాఫ్రికా 10 పాయింట్లతో 2వ స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ 6 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో 3వ స్థానంలో ఉంది. ఇప్పుడు ఆస్ట్రేలియా 6 మ్యాచుల్లో 4 గెలిచి 4వ స్థానంలో ఉంది. అందువల్ల భారత జట్టు తదుపరి మూడు మ్యాచ్‌ల్లో ఒక్క విజయం సాధిస్తే టాప్-4లో స్థానం సంపాదించి సెమీఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటుంది.

శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లు ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు మాత్రమే ఆడాయి. కాబట్టి ఈ రెండు జట్లలో ఒక జట్టు తదుపరి అన్ని మ్యాచ్‌లలో గెలిచి 12 పాయింట్లు సంపాదించే అవకాశం ఉంది. దీంతో 6 మ్యాచ్‌లు గెలిచినా టీమ్ ఇండియా సెమీఫైనల్ స్థానం ఖాయం కాదు. తదుపరి 4 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘనిస్థాన్, శ్రీలంక జట్లు ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోతే.. భారత జట్టు సెమీఫైనల్ ఆడడం ఖాయం.

ఇవి కూడా చదవండి

సెమీస్‌ రేసులో శ్రీలంక-ఆఫ్ఘనిస్థాన్

View this post on Instagram

A post shared by ICC (@icc)

భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్:

  • నవంబర్ 2: భారత్ vs శ్రీలంక (ముంబై)
  • నవంబర్ 5: భారత్ vs దక్షిణాఫ్రికా (కోల్‌కతా)
  • నవంబర్ 12: భారత్ vs నెదర్లాండ్స్ (బెంగళూరు)

టీమ్ ఇండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్.

మరిన్నిక్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
ఫ్యాన్సీ డ్రెస్ పోటీ.. బుర్జ్ ఖలీఫా వేషంలో అదరగొట్టిన బుడ్డొడు..
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
బిగ్‌ అలర్ట్‌.. జనవరి నుంచి ఈ పాన్‌ కార్డులు చెల్లవు.. ఎలా మరి?
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...