Pakistan: 50 రన్స్ చేసి ఔటైన పాక్ ఆటగాళ్లను జట్టు నుంచి తీసేయాల్సిందే: మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
పాక్ జట్టులో దూకుడు కొరవడిందని రమీజ్ రాజా పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో సంభాషణ సందర్భంగా పాక్ జట్టుపై విమర్శలు గుప్పించాడు. ఇకపై టీ20 ఆటగాళ్లు వన్డేల్లో ఆడాల్సి ఉంటుంది. కాస్త మూడ్ మార్చుకుని, కాస్త స్పీడ్ పెంచాల్సి వస్తుంది. ఫీల్డింగ్ మెరుగ్గా ఉండాలి. కొత్త బంతితో బౌలింగ్ మరింత మెరుగ్గా ఉండాలి.

Pakistan: ప్రపంచకప్(World Cup)లో పాకిస్థాన్ జట్టు నిరంతర పరాజయాలను ఎదుర్కొంటోంది. ఈ కారణంగా జట్టుపై చాలా విమర్శలు వస్తున్నాయి. కాగా, మాజీ క్రికెటర్ రమీజ్ రాజా జట్టు ఓ పాకిస్తాన్ బ్యాట్స్‌మెన్‌ను టార్గెట్ చేశాడు. టీ20లా ఆడగలిగే ఆటగాళ్లు ఇప్పుడు వన్డే జట్టుకు అవసరమని అన్నాడు. ఇది కాకుండా, 50 పరుగులు చేసిన తర్వాత ఔట్ అయిన ఆటగాళ్లను డ్రాప్ చేయడం గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ కూడా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ జట్టు 46.4 ఓవర్లలో 270 పరుగులకే పరిమితమైంది. ఈ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 47.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఛేదించింది. దక్షిణాఫ్రికా 260 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఈ మ్యాచ్‌లో పాక్ జట్టు గెలుస్తుందేమో అనిపించింది. కానీ, చివరికి దక్షిణాఫ్రికా జట్టు గెలిచింది. ఈ ఓటమి తర్వాత సెమీఫైనల్‌కు వెళ్లాలన్న పాక్ ఆశలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. బాబర్ సేన ఇప్పుడు వరుసగా నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయింది. వారి ప్రదర్శన చాలా పేలవంగా తయారైంది.
వన్డేల్లో టీ20 ఆటగాళ్లను తీసుకురావాలి – రమీజ్ రాజా..
View this post on Instagram
పాక్ జట్టులో దూకుడు కొరవడిందని రమీజ్ రాజా పేర్కొన్నాడు. తన యూట్యూబ్ ఛానెల్‌లో సంభాషణ సందర్భంగా పాక్ జట్టుపై విమర్శలు గుప్పించాడు. ఇకపై టీ20 ఆటగాళ్లు వన్డేల్లో ఆడాల్సి ఉంటుంది. కాస్త మూడ్ మార్చుకుని, కాస్త స్పీడ్ పెంచాల్సి వస్తుంది. ఫీల్డింగ్ మెరుగ్గా ఉండాలి. కొత్త బంతితో బౌలింగ్ మరింత మెరుగ్గా ఉండాలి.
అదే విధంగా బ్యాటింగ్‌లో ఎవరైనా 50 పరుగులు చేసి ఔట్ అయితే, ఈ పని ఒకటికి రెండుసార్లు చేస్తే, అతనికి వార్నింగ్ ఇచ్చి జట్టు నుంచి తప్పించాలి. ఎందుకంటే అలాంటి బ్యాట్స్‌మెన్ కూడా ఓవర్లు తిని, సమయం తీసుకుంటూ, ఇన్నింగ్స్‌ని మేనేజ్ చేసి, చివరికి ఇన్నింగ్స్‌ను కూడా నాశనం చేస్తారంటూ చెప్పుకొచ్చాడు.
View this post on Instagram
పాకిస్థాన్ జట్టు: అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), సౌద్ షకీల్, షాదాబ్ ఖాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాహీన్ అఫ్రిది, ఉసామా మీర్, హసన్ అలీ, హరీస్ రవూఫ్, మహ్మద్ వసీం జూనియర్, ఫఖర్ జమాన్, అఘా సల్మాన్, మహ్మద్ నవాజ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








