AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cricket: 9ఫోర్లు, 6 సిక్స్‌లతో విధ్వంసం..140కు పైగా స్రైక్‌రేట్‌తో మెరుపు సెంచరీ.. అయినా జట్టును మాత్రం..

ICC పురుషుల క్రికెట్ వరల్డ్ లీగ్ 2 మ్యాచ్‌లో, USA బ్యాటర్‌ ఆరోన్ జోన్స్ పెను విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చినప్పుడు ఆచితూచి ఆడిన అతను తొలి 50 బంతుల్లో 56 పరుగులు మాత్రమే చేశాడు. ఆతర్వాత గేర్‌ మార్చి తర్వాతి 26 బంతుల్లోనే తొలి సెంచరీ పూర్తి చేశాడు.

Cricket: 9ఫోర్లు, 6 సిక్స్‌లతో విధ్వంసం..140కు పైగా స్రైక్‌రేట్‌తో మెరుపు సెంచరీ.. అయినా జట్టును మాత్రం..
Aaron Jones
Basha Shek
|

Updated on: Aug 14, 2022 | 9:46 PM

Share

ICC పురుషుల క్రికెట్ వరల్డ్ లీగ్ 2 మ్యాచ్‌లో, USA బ్యాటర్‌ ఆరోన్ జోన్స్ పెను విధ్వంసం సృష్టించాడు. క్రీజులోకి వచ్చినప్పుడు ఆచితూచి ఆడిన అతను తొలి 50 బంతుల్లో 56 పరుగులు మాత్రమే చేశాడు. ఆతర్వాత గేర్‌ మార్చి తర్వాతి 26 బంతుల్లోనే తొలి సెంచరీ పూర్తి చేశాడు. ఇలా మొత్తంమీద స్కాట్లాండ్‌పై జోన్స్ 87 బంతుల్లో అజేయంగా 123 పరుగులు చేశాడు. ఈ తుఫాను ఇన్నింగ్స్‌లో అతను 9 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి. జోన్స్‌కు ఇది కెరీర్‌లో తొలిసెంచరీ. జోన్స్ సెంచరీతో USA నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 295 పరుగులు చేసింది. అయితే 296 పరుగుల లక్ష్యాన్ని స్కాట్లాండ్ 14 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లను కోల్పోయి ఛేదించింది. కాగా 2019లో దుబాయ్‌లో యూఏఈతో జరిగిన టీ20 మ్యాచ్‌లో జోన్స్ అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. అతను USA తరపున 19 T20, 24 ODI మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో అతని పేరు మీద 1 సెంచరీ, 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 123 నాటౌట్‌ ఇన్నింగ్స్‌ కూడా అతని కెరీర్‌లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌.

సిక్స్‌తో సెంచరీ పూర్తి.. అమెరికా స్టార్ బ్యాటర్‌ జోన్స్ తన కెరీర్‌లో తొలి సెంచరీని సిక్సర్‌తో పూర్తి చేసుకున్నాడు. స్టీవెన్‌ టేలర్‌, సుశాంత్‌ మోదానీ అమెరికాకు శుభారంభం అందించారు. వారిద్దరూ 101 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరుకున్న తర్వాత, జోన్స్, మోనాక్ పటేల్‌లు జట్టుకు భారీ స్కోరును అందించేందుకు కృషి చేశారు. ఇలా మొత్తం మీద USAను 295 పరుగులకు చేర్చారు. 296 పరుగుల లక్ష్యానికి సమాధానంగా, మెక్‌లియోడ్ 117 పరుగులు చేసి జోన్స్‌ సెంచరీని వృథా చేశాడు. మెక్‌లియోడ్ 91 బంతుల్లో 117 పరుగులు చేశాడు. అతడితో పాటు క్రెయిగ్ వాలెస్ 45 పరుగులు, కెప్టెన్ మాథ్యూ క్రాస్ 40 పరుగులు చేశారు. మెక్‌లియోడ్ 2 క్యాచ్‌లు కూడా పట్టాడు. ఈక్రమంలోనే ప్లేయర్‌ ఆఫ్‌ది సిరీస్‌గా ఎంపికయ్యాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..