IND vs BAN: తొలిరోజు ఆటలో భారీ తప్పిదం.. బంగ్లా జట్టుకు బిగ్ షాక్ ఇవ్వనున్న ఐసీసీ.. అదేంటంటే?
India vs Bangladesh Test: బంగ్లాదేశ్ జట్టు తొలి రోజు ఆటను అద్భుతంగా ప్రారంభించింది. కేవలం 144 పరుగుల వద్ద బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా కలిసి బంగ్లాదేశ్‌ను చీల్చి చెండాడారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది.
India vs Bangladesh Test: చెన్నైలో నిన్న అంటే సెప్టెంబర్ 19న, కెప్టెన్ నజ్ముల్ హసన్ శాంటో టాస్ గెలిచి బౌలింగ్ తీసుకోవడంతో బంగ్లాదేశ్ అదృష్టం అనుకూలంగా ఉంది. ఆరంభం బాగానే ఉండడంతో రోహిత్-గంభీర్ టెన్షన్ పడ్డారు. కానీ, అశ్విన్-జడేజా బంగ్లాదేశ్‌కు పీడకలగా మారారు. దీంతో విజిటింగ్ టీమ్ కకావికలం అయిపోయింది. దీంతో ఆ జట్టుపై ఐసీసీ కీలక చర్య తీసుకోవచ్చని తెలుస్తోంది.
భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టు తొలి రోజున టీమిండియా 80 ఓవర్లు ఆడాల్సి ఉంది. ఈ క్రమంలో క్రికెట్ వ్యాఖ్యాత హర్షా భోగ్లే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X లో పోస్ట్ చేసి, ‘అదనపు అరగంట సమయం ఉన్నప్పటికీ 80 ఓవర్ల కంటే తక్కువ బౌలింగ్ చేసింది. ఇది ఆమోదయోగ్యం కాదు. టెస్ట్‌ల్లో జట్టు కనీసం మూడు సెషన్లలో 90 ఓవర్లు ఆడాలని తెలిసిందే. కానీ, బంగ్లాదేశ్ జట్టు 30 నిమిషాల అదనపు సమయం ఉన్నప్పటికీ 80 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసింది’ అంటూ తెలిపారు.
కీలక చర్యలకు ఐసీసీ సిద్ధం..
బంగ్లాదేశ్ జట్టు తొలి రోజు ఆటను అద్భుతంగా ప్రారంభించింది. కేవలం 144 పరుగుల వద్ద బంగ్లాదేశ్ 6 వికెట్లు కోల్పోయింది. అయితే, ఆ తర్వాత ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా కలిసి బంగ్లాదేశ్‌ను చీల్చి చెండాడారు. దీంతో సహనం కోల్పోయిన బంగ్లా జట్టుకు.. ఐసీసీ మరో బిగ్ షాక్ తగలనుంది. 10 ఓవర్ల కంటే తక్కువ బౌలింగ్ చేసినందుకు బంగ్లాదేశ్‌పై ఐసీసీ కఠిన చర్యలు తీసుకోవచ్చని తెలుస్తోంది. ఇందులో బంగ్లాదేశ్‌కు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో 3 పాయింట్లు, మ్యాచ్ ఫీజులో 15 శాతం జరిమానా విధించే అవకాశం ఉంది. పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్టులో కూడా బంగ్లాదేశ్ 3 ఓవర్ల తేడాతో వెనుదిరిగినందుకు శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చింది.
ప్రస్తుత పరిస్థితి..
What a sight for a fast bowler!
Akash Deep rattles stumps twice, giving #TeamIndia a great start into the second innings.
Watch the two wickets here 👇👇#INDvBAN @IDFCFIRSTBank pic.twitter.com/TR8VznWlKU
— BCCI (@BCCI) September 20, 2024
ప్రస్తుతం వార్త రాసే సమయానికి బంగ్లాదేశ్ 5 వికెట్లు కోల్పోయి 79 పరుగులు చేసింది. క్రీజులో షకీబ్ 23, లిటన్ దాస్ 19 పరుగులతో ఆడుతున్నారు. బుమ్రా 2, ఆకాశ్ దీప్ 2, సిరాజ్ 1 వికెట్ పడగొట్టారు.
రెండు జట్ల ప్లేయింగ్-11..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, ఆకాశ్ దీప్, మహ్మద్ సిరాజ్.
బంగ్లాదేశ్: నజ్ముల్ హసన్ శాంటో (కెప్టెన్), షద్మాన్ ఇస్లాం, జకీర్ హసన్, మోమినుల్ హక్, ముష్ఫికర్ రహీమ్, షకీబ్ అల్ హసన్, లిటన్ దాస్ (వికెట్ కీపర్), మెహిదీ హసన్ మిరాజ్, నహిద్ రాణా, హసన్ మహమూద్, తస్కిన్ అహ్మద్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..