IND Vs PAK: సింహం ముందే కుప్పిగంతులా.! PSLపై బ్యాన్ దిశగా ఐసీసీ అల్టిమేటం..

సింహం ముందు కుప్పిగంతలు వేస్తే.. తోక కత్తిరించి పక్కన పెట్టేరనేలా ఏర్పడింది పాకిస్తాన్ జట్టు పరిస్థితి. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత్ జట్టుతో తాము ఆడమని చెప్పేసినంత ఈజీ కాదు.. ఎదురయ్యే పరిణామాలు ఎదుర్కునేందుకు.. ఐసీసీ గట్టిగా అల్టిమేటం ఇచ్చింది. ఆ వివరాలు..

IND Vs PAK: సింహం ముందే కుప్పిగంతులా.! PSLపై బ్యాన్ దిశగా ఐసీసీ అల్టిమేటం..
Team Pakistan

Updated on: Feb 04, 2026 | 1:03 PM

2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలనే పాకిస్తాన్ నిర్ణయం పీసీబీకి శాపంగా మారనుంది. ఒప్పంద ఉల్లంఘనపై ఐసీసీ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. 200 కోట్ల రూపాయల నష్టంతో పాటు వార్షిక ఆదాయానికి గండి, టోర్నీ నుంచి తొలగింపు, పీఎస్‌ఎల్‌పై ఆంక్షలు ఎదురయ్యే ముప్పు ఉంది. పాక్ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడనుంది. వివరాల్లోకి వెళ్తే..! 2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరించాలనే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) నిర్ణయం ఆ దేశ క్రికెట్‌కు తీవ్ర పరిణామాలను తీసుకురానుంది. ఇప్పటికే కుదుర్చుకున్న ఒప్పందాలను ఉల్లంఘించినందుకు గానూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి కఠిన చర్యలకు సన్నద్ధమవుతోంది. ఈ మ్యాచ్ రద్దయితే గనుక, బ్రాడ్‌కాస్టర్లకు సుమారు 200 కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

ఈ నష్టాన్ని పీసీబీ భరించాల్సి రావచ్చు. అంతేకాకుండా, ఐసీసీ నుంచి పీసీబీకి అందే వార్షిక ఆదాయానికి కూడా గండి పడే అవకాశం ఉంది. పాకిస్తాన్‌ను టోర్నీ నుంచి తప్పించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. మరోవైపు, పీసీబీకి ప్రధాన ఆదాయ వనరైన పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్‌ఎల్)పై కూడా ఐసీసీ ఆంక్షలు విధించే ప్రమాదం ఉంది. విదేశీ ఆటగాళ్లు పీఎస్‌ఎల్‌లో పాల్గొనకుండా వారి దేశాల బోర్డులు ఎన్‌వోసీలను నిలిపివేస్తే, ఈ లీగ్ కళ తప్పడమే కాకుండా ఆర్థికంగా కోలుకోలేని దెబ్బ తగులుతుంది. రాజకీయ కారణాలతో క్రీడలను అడ్డుకోవడం వల్ల పాక్ క్రికెట్ భవిష్యత్తు అంధకారంలో పడేలా కనిపిస్తోంది.

ఇది చదవండి: గంగమ్మకు మొక్కి చెరువులో వల వేసిన జాలరి.. చిక్కింది చూసి స్టన్

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి