Babar Azam : అవుటైన కోపం అంతా స్టంప్స్‌పై చూపించిన బాబర్.. కొరడా ఝుళిపించిన ఐసీసీ
పాకిస్తాన్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్య తీసుకుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు గాను, బాబర్ అజామ్‌పై అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. ఈ సంఘటన శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో జరిగింది.

Babar Azam : పాకిస్తాన్ మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్‌మెన్ బాబర్ అజామ్ పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ చర్య తీసుకుంది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లోని లెవల్ 1 నిబంధనను ఉల్లంఘించినందుకు గాను, బాబర్ అజామ్‌పై అతని మ్యాచ్ ఫీజులో 10 శాతం జరిమానా విధించారు. ఈ సంఘటన శ్రీలంకతో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో జరిగింది. ఆటగాళ్ల క్రమశిక్షణ విషయంలో ఐసీసీ ఎంత కఠినంగా ఉంటుందో ఈ సంఘటన మరోసారి నిరూపించింది.
రావల్పిండిలో నవంబర్ 16న జరిగిన పాకిస్తాన్ vs శ్రీలంక మూడో వన్డే మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ బ్యాటింగ్ చేస్తున్న 21వఓవర్‌లో, బాబర్ అజామ్ అవుట్ అయిన తర్వాత క్రీజ్ వదిలి వెళ్లే ముందు తన బ్యాట్‌తో స్టంప్స్‌ను కొట్టాడు (లేదా బంతిని స్టంప్స్‌పై కొట్టాడు). ఈ చర్యను ఐసీసీ ఆచార నియమావళిలోని ఆర్టికల్ 2.2 ఉల్లంఘనగా పరిగణించారు. ఈ ఆర్టికల్ అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో క్రికెట్ పరికరాలు, మైదాన పరికరాలు లేదా ఫిట్టింగ్‌లను దుర్వినియోగం చేయకుండా ఉండాలని చెబుతుంది.
జరిమానాతో పాటు బాబర్ అజామ్ క్రమశిక్షణ రికార్డులో ఒక డీమెరిట్ పాయింట్ కూడా యాడ్ చేశారు. గత 24 నెలల కాలంలో బాబర్ అజామ్‌కు ఇది మొదటి తప్పిదం. మైదానంలో ఉన్న అంపైర్లు, థర్డ్ అంపైర్, ఫోర్త్ అంపైర్ ఈ ఆరోపణలను నమోదు చేశారు. ఆ తర్వాత ఐసీసీ ఇంటర్నేషనల్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీ అయిన అలీ నఖ్వీ జరిమానాను ప్రతిపాదించారు. బాబర్ అజామ్ తన తప్పును అంగీకరించడంతో, ఎలాంటి అధికారిక విచారణ అవసరం లేకుండానే జరిమానాను ఆమోదించారు.
ఈ మూడో వన్డే మ్యాచ్‌లో పాకిస్తాన్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శ్రీలంక జట్టు 45.2 ఓవర్లలో కేవలం 211 పరుగులకే ఆలౌట్ అయింది. సదీరా సమరవిక్రమ 48 పరుగులు చేశాడు. పాకిస్తాన్ బౌలర్లలో మహమ్మద్ వసీం జూనియర్ 3 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ 44.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. పాకిస్తాన్ తరఫున ఫఖర్ జమాన్ 55 పరుగులు, మహమ్మద్ రిజ్వాన్ 61 పరుగులు, హుస్సేన్ తలత్ అజేయంగా 42 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్ జెఫ్రీ వాండర్సే 3 వికెట్లు పడగొట్టాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
