AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haider Ali : పాక్ క్రికెటర్ పై అత్యాచారం కేసు.. ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా ?

పాకిస్థాన్ క్రికెటర్ హైదర్ అలీపై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో క్రికెట్ ప్రపంచంలో కలకలం రేగింది. మాంచెస్టర్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ పూర్తయ్యే వరకు అతను ఇంగ్లండ్‌ను విడిచి వెళ్లకూడదని, అతని పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారని సమాచారం.

Haider Ali : పాక్ క్రికెటర్ పై అత్యాచారం కేసు.. ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుందో తెలుసా ?
Haider Ali
Rakesh
|

Updated on: Aug 08, 2025 | 3:30 PM

Share

Haider Ali : పాకిస్తాన్ క్రికెటర్ హైదర్ అలీ పై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో క్రికెట్ ప్రపంచలో కలకలం రేగింది. ఈ సంఘటన తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అతన్ని సస్పెండ్ చేసింది. మాంచెస్టర్ పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మాంచెస్టర్ పోలీసుల విచారణలో ఉన్న హైదర్ అలీ ఇంగ్లాండ్‌ను విడిచి వెళ్ళకూడదని, అతని పాస్‌పోర్ట్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 24 ఏళ్ల హైదర్ అలీపై ఉన్న ఈ ఆరోపణలు నిజమని రుజువైతే, అతనికి ఎంత కాలం జైలు శిక్ష పడుతుంది? ఇంగ్లాండ్ చట్టాల ప్రకారం లైంగిక దాడి కేసులకు శిక్ష ఎలా ఉంటుంది? ఈ వివరాలన్నీ ఇప్పుడు తెలుసుకుందాం.

24 ఏళ్ల పాకిస్థాన్ క్రికెటర్ హైదర్ అలీపై లైంగిక దాడి ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో అతను దోషిగా తేలితే, అతనికి ఎన్ని సంవత్సరాల జైలు శిక్ష పడుతుందో ఇప్పుడు చూద్దాం. ఇంగ్లండ్‌లో లైంగిక సంబంధాలకు చట్టపరమైన వయస్సు 16 సంవత్సరాలు. 16 ఏళ్లలోపు అమ్మాయితో ఆమె సమ్మతితో లైంగిక సంబంధం పెట్టుకోవడం కూడా చట్టవిరుద్ధమే. ఇంగ్లండ్ చట్టాల ప్రకారం రేప్‌ను ఐదు రకాలుగా విభజించారు. భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త లైంగిక సంబంధం పెట్టుకుంటే కూడా కేసు పెట్టవచ్చు. అయితే, హైదర్ అలీపై ఏ రకం లైంగిక దాడి కేసు నమోదైందనే విషయం ఇంకా తెలియలేదు.

ఇంగ్లండ్‌లో లైంగికదాడి కేసులో దోషికి ఎంత శిక్ష పడుతుందనేది నేరం రకం, క్రూరత్వంపై ఆధారపడి ఉంటుంది. Lawtonslaw.co.uk ప్రకారం, కచ్చితమైన సమయం చెప్పడం కష్టం. కానీ సాధారణంగా దోషికి 4 నుంచి 19 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది.

హైదర్ అలీ ఈ కేసులో దోషిగా తేలితే, అతనికి కనీసం నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. ఇంగ్లండ్‌లో లైంగికదాడి కేసులకు ఇది కనీస శిక్ష. కానీ చాలా అరుదుగా మాత్రమే ఇంత తక్కువ శిక్ష పడుతుంది. ఈ కేసులో ఇంకా కొన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆరోపణలు చేసిన మహిళ వయస్సు ఎంత? ఆమె వయస్సు 16 ఏళ్లలోపు అయితే హైదర్ అలీ సమస్యలు మరింత పెరుగుతాయి. ఆ మహిళ ఇంగ్లండ్ నివాసి, లేక పాకిస్థాన్ మూలాలున్న వ్యక్తా అనేది తెలియదు. ఈ లైంగికదాడి ఆరోపణ ఏ కేటగిరీ కిందకు వస్తుంది?, హైదర్ అలీ మహిళపై శారీరక దాడికి పాల్పడ్డాడా, లేదా బెదిరించాడా? హైదర్ అలీకి ఆ మహిళతో ముందుగానే పరిచయం ఉందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది.

ఇంగ్లండ్‌లో లైంగిక దాడి కేసులకు గరిష్ట శిక్ష జీవిత ఖైదు. అయితే జీవిత ఖైదు అంటే జీవితాంతం జైలులో ఉండడం కాదు. సాధారణంగా 15 సంవత్సరాల జైలు శిక్ష తర్వాత దోషిని విడుదల చేస్తారు. కానీ, అతను మిగిలిన జీవితం కఠినమైన చట్టాల పర్యవేక్షణలో ఉండాల్సి వస్తుంది. ఒకవేళ ఏ చిన్న నేరం చేసినా తిరిగి జైలుకు పంపుతారు. మీడియా నివేదికల ప్రకారం, హైదర్ అలీకి బెయిల్ లభించిందని, కాబట్టి అతనికి జీవిత ఖైదు పడే అవకాశాలు చాలా తక్కువని తెలుస్తోంది.

హైదర్ అలీ 2020లో పాకిస్థాన్ తరపున టీ20, వన్డేలలో అరంగేట్రం చేశాడు. అతను రెండు వన్డేల్లో 42 పరుగులు, 35 టీ20 మ్యాచ్‌లలో 505 పరుగులు చేశాడు. 2023 అక్టోబర్‌లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఈ ఘటన తర్వాత పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) అతన్ని సస్పెండ్ చేసింది.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..