AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unique Record: 37 సిక్సర్లతో 349 పరుగులు.. టీ20 క్రికెట్‌లోనే నయా ఊచకోత.. ప్రపంచ రికార్డ్‌‌ బద్దలు

Unique Cricket Records: ఐపీఎల్‌‌లో ఎన్నో ఉత్తేజకరమైన మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఇప్పటివరకు ఈ లీగ్‌లో ఏ జట్టు కూడా 300 మార్కును తాకలేదు. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు 287 పరుగులు. ఇది ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేసింది. కానీ..

Unique Record: 37 సిక్సర్లతో 349 పరుగులు.. టీ20 క్రికెట్‌లోనే నయా ఊచకోత.. ప్రపంచ రికార్డ్‌‌ బద్దలు
Unique Cricket Records (1)
Venkata Chari
|

Updated on: Aug 27, 2025 | 1:40 PM

Share

Unique Cricket Records: ఆధునిక క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌ను చాలా మంది ఇష్టపడుతున్నారు. 20-20 ఓవర్ల మ్యాచ్‌లో, ఫోర్లు, సిక్సర్ల మోత మోగిపోతుంటుంది. కానీ ఇప్పుడు ఈ ఫార్మాట్ బౌలర్లకు భయంకరంగా మారుతున్నట్లు కనిపిస్తోంది. టీ20 ఫార్మాట్‌లో చేసిన 349 పరుగుల అద్భుతమైన రికార్డును చూస్తే కచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. టీ20 ఫార్మాట్‌లో చేసిన అత్యధిక స్కోర్‌ను ODIలలో కూడా ఏ జట్టు సాధించడం కష్టంగా మారింది. టీ20 మ్యాచ్‌లో, సిక్సర్లు, ఫోర్ల విధ్వంసంతో ఈ జట్టు సులభంగా 300 మార్కును దాటింది.

ఐపీఎల్‌లోనూ 300 పరుగులు చేయలే..

ఐపీఎల్‌‌లో ఎన్నో ఉత్తేజకరమైన మ్యాచ్‌లు జరిగాయి. కానీ ఇప్పటివరకు ఈ లీగ్‌లో ఏ జట్టు కూడా 300 మార్కును తాకలేదు. ఐపీఎల్‌లో అత్యధిక స్కోరు 287 పరుగులు. ఇది ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు చేసింది. కానీ, సయ్యద్ ముష్తాక్ అలీ ట్రోఫీలో, టీ20 ఫార్మాట్‌లో అలాంటి ఘనత సాధించిన జట్టు ఒకటి ఉంది.

సెంచరీతో చెలరేగిన బ్యాటర్..

డిసెంబర్ 2024లో, బరోడా వర్సెస్ సిక్కిం మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో, బరోడా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఓపెనర్లు శాశ్వత్ రావత్, అభిమన్యు సింగ్ వచ్చిన వెంటనే తుఫాను సృష్టించారు. శాశ్వత్ కేవలం 16 పరుగులు మాత్రమే చేశాడు. అతను 17 బంతుల్లో 4 సిక్సర్లు, 4 ఫోర్లతో 43 పరుగులు చేయగా, అభిమన్యు 17 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అభిమన్యు ఇన్నింగ్స్‌లో 5 సిక్సర్లు, 4 ఫోర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

అలజడి సృష్టించిన భాను..

ఓపెనర్ల వికెట్లు పడగొట్టిన తర్వాత, భాను సిక్కిం బౌలర్లను చెడుగుడు ఆడేశాడు. భాను కేవలం 51 బంతుల్లో 134 పరుగులు చేశాడు. అందులో అతను 15 సిక్సర్లు, 5 ఫోర్లు బాదాడు. ఇది మాత్రమే కాదు, నాలుగో స్థానంలో ఉన్న శివాలిక్ శర్మ 17 బంతుల్లో 6 సిక్సర్లు, 3 ఫోర్లతో 55 పరుగులు చేశాడు. దీంతో పాటు, ఐదో స్థానంలో ఉన్న బ్యాటర్ కూడా 16 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 6 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి.

ప్రపంచ రికార్డు..

బరోడా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు సిక్కిం బౌలర్లు చేతులెత్తేశారు. ఈ ప్రపంచ రికార్డు ఈ మ్యాచ్‌లో నమోదైంది. ఇప్పటివరకు ఏ టీ20 మ్యాచ్‌లోనూ మొత్తం 349 పరుగులు నమోదు కాలేదు. ఇప్పుడు ఈ రికార్డు ప్రపంచ క్రికెట్‌లో ఎంతకాలం ఉంటుందో చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..