2018 ఐపీఎల్ వేలంలో నన్ను అవమానించారు..! కానీ కోహ్లీ ఆదరించాడని చెబుతున్న ఆర్‌సీబీ బౌలర్..
Harshal Patel : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపిఎల్ 2021లో తన హవా కొనసాగిస్తున్నాడు. ప్రారంభ మ్యాచ్‌లో
Harshal Patel : రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫాస్ట్ బౌలర్ హర్షల్ పటేల్ ఐపిఎల్ 2021లో తన హవా కొనసాగిస్తున్నాడు. ప్రారంభ మ్యాచ్‌లో అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. ముంబై ఇండియన్స్‌పై ఆర్‌సిబి విజయం సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. అయితే 2018 ఐపీఎల్ వేలంలో జట్ల నిర్లక్ష్యం వల్ల తాను ‘అవమానానికి గురయ్యానని వెల్లడించాడు. అందుకే తాను సమర్థవంతమైన ఆల్ రౌండర్‌గా ఎదిగానని గుర్తుచేశాడు. 2018 లో Delhi క్యాపిటల్స్ రూ .20 లక్షలకు కొనుగోలు చేసినప్పటికీ ఆడటానికి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు.
విలేకరుల సమావేశంలో పటేల్ మాట్లాడుతూ.. ‘2018 ఐపీఎల్‌పై ఎక్కువ మంది ఆసక్తి చూపలేదు అది తనకు నిరుత్సాహాన్ని కలిగించిందని చెప్పాడు. ఆటగాడిగా డిమాండ్ ఉండాలి… ఆ తర్వాత తన బ్యాటింగ్ శైలిని ప్రజలు విశ్వసిస్తే సమర్థవంతమైన ఆటగాడిగా గుర్తింపు లభిస్తుందని అన్నాడు. ఐపీఎల్‌లో తన ఆటతీరుకు సంబంధించి ఆందోళనను తాను ఎదుర్కొన్నానని గుర్తు చేశాడు. ఎందుకంటే ఒక మ్యాచ్‌లో పేలవమైన ప్రదర్శన తర్వాత జట్టు నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అన్నాడు.
ప్రస్తుత సీజన్‌లో అలాంటి పరిస్థితి లేదన్నాడు. ఇప్పటివరకు జరిగిన కొన్ని మ్యాచ్‌లను పరిశీలిస్తే అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఆటగాళ్ళు ఇప్పుడు బాగా రాణిస్తున్నారని చెప్పాడు. జట్టు నిర్వహణలో ఆలోచన ఇప్పుడు మారిందన్నాడు. Delhi క్యాపిటల్స్ నుంచి బెంగళూరు జట్టుకు రావడం వల్ల తానకు చాలా ఆనందంగా ఉందని చెప్పాడు పటేల్. కెప్టెన్ విరాట్ కోహ్లీ డెత్ ఓవర్లలో బౌలింగ్ బాధ్యతను అప్పగిస్తాడన్నారు. ఆ సమయంలో తాను సమర్థవంతంగా బౌలింగ్ బాధ్యతలను నిర్వర్తిస్తానన్నారు.