Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ind vs Eng : భారత్ పై విరుచుకుపడ్డ ఇంగ్లాండ్ బ్యాటర్లు.. హ్యారీ బ్రూక్ – జేమీ స్మిత్ రికార్డ్ భాగస్వామ్యం

ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్‌లో హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ రికార్డు భాగస్వామ్యంతో ఇంగ్లాండ్ పుంజుకుంది. భారత్‌పై ఆరో వికెట్‌కు 200+ పరుగులు చేసిన తొలి ఇంగ్లాండ్ జోడీగా వీరు నిలిచారు. ఈ అరుదైన ఘనతతో రెండో టెస్ట్ మ్యాచ్ తీవ్ర ఉత్కంఠగా మారింది.

Ind vs Eng : భారత్ పై విరుచుకుపడ్డ ఇంగ్లాండ్ బ్యాటర్లు.. హ్యారీ బ్రూక్ - జేమీ స్మిత్ రికార్డ్ భాగస్వామ్యం
Test Cricket
Lohith Kumar
|

Updated on: Jul 04, 2025 | 8:33 PM

Share

Ind vs Eng : భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో రెండో టెస్ట్ మ్యాచ్ ఎడ్జ్‌బాస్టన్‌లో ఊహించని మలుపు తిరిగింది. మొదటి రెండు రోజులు బ్యాటింగ్, బౌలింగ్‌లో భారత్ ఆధిపత్యం చెలాయించినా.. మూడో రోజు హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ ల రికార్డు పార్టనర్ షిప్‎తో ఇంగ్లాండ్ అద్భుతంగా పుంజుకుంది. భారత్ భారీగా 587 పరుగులు చేసిన తర్వాత, ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో చాలా కష్టాల్లో పడింది. కేవలం 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి త్వరగా ఆలౌట్ అయ్యేలా కనిపించింది. అయితే అక్కడి నుంచి యువ బ్యాటర్లు జేమీ స్మిత్, హ్యారీ బ్రూక్ క్రీజులోకి వచ్చి అద్బుతంగా ఆడారు.

ఈ జోడీ ఇన్నింగ్స్‌ను నిలబెట్టడమే కాకుండా భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగింది. ఇద్దరు బ్యాటర్లు సెంచరీలు సాధించడమే కాకుండా.. ఆరో వికెట్‌కు 200 పైగా పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. భారత బౌలర్లను నిరాశపరిచి ఇంగ్లాండ్‌కు తిరిగి ఆశలు పోశారు. ఇది కేవలం ఒక సాధారణ భాగస్వామ్యం కాదు. టెస్ట్ చరిత్రలో భారత్‌పై ఆరో వికెట్‌కు ఇంగ్లాండ్ సాధించిన మొదటి 200 పరుగుల భాగస్వామ్యం ఇదే. గతంలో జో రూట్, జేమ్స్ ఆండర్సన్ 2014లో ట్రెంట్ బ్రిడ్జ్‌లో 10వ వికెట్‌కు 198 పరుగులు జోడించి రికార్డు సృష్టించారు. ఆ పార్టనర్ షిప్ ఇప్పటి వరకు అద్భుతమైనదిగా మిగిలిపోయింది. ఇప్పుడు బ్రూక్, స్మిత్ నెలకొల్పిన ఈ భాగస్వామ్యం రికార్డు పుస్తకాల్లో తనదైన స్థానాన్ని సంపాదించుకుంది.

ఇంగ్లాండ్ టాప్ 3 ఆరో వికెట్ పార్టనర్ షిప్స్

హ్యారీ బ్రూక్, జేమీ స్మిత్ – 200*, ఎడ్జ్‌బాస్టన్, 2025

క్రిస్ వోక్స్, జానీ బెయిర్‌స్టో – 189, లార్డ్స్

బాబ్ టేలర్, ఇయాన్ బోథమ్ – 171, ముంబై, 1980

టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొదటి ఇన్నింగ్స్‌లో 550+ పరుగులు చేసిన తర్వాత ఆరో వికెట్ లేదా అంతకంటే తక్కువ వికెట్‌కు 200+ భాగస్వామ్యం నమోదు కావడం ఇది మూడోసారి మాత్రమే. గతంలో ఇలా జరిగిన రెండు సందర్భాలు ఉన్నాయి. 1955లో వెస్టిండీస్ vs ఆస్ట్రేలియా మధ్య బ్రిడ్జ్‌టౌన్‎లో జరిగినప్పుడు, 2009లో భారత్ vs శ్రీలంక మధ్య అహ్మదాబాద్ లో జరిగినప్పుడు ఇలా నమోదైంది.

ప్రస్తుతం ఇంగ్లాండ్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 324 పరుగులు చేసింది. మ్యాచ్ మూడో రోజు రెండో సెషన్‌లో ఉంది. హ్యారీ బ్రూక్ 116 పరుగులతో, జేమీ స్మిత్ 150 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. వారి భాగస్వామ్యం కేవలం 248 బంతుల్లో 240 పరుగులకు చేరుకుంది. ఇంగ్లాండ్ ఇంకా భారత్ కంటే 262 పరుగులు వెనుకబడి ఉన్నప్పటికీ మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి