Hardik Pandya: ‘నువ్వెక్కడున్నా నా మనసంతా నీ చుట్టే’.. కుమారుడి పుట్టిన రోజున హార్దిక్ పాండ్యా ఎమోషనల్

|

Jul 30, 2024 | 4:05 PM

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిక్ తో విడిపోయాడు. ఇటీవలే తమ విడాకులను ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందే కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయింది నటాషా. మరోవైపు హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంకలో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే జులై 30వ తేదీ హార్దిక్ పాండ్యా జీవితంలో చాలా ప్రత్యేకం.

Hardik Pandya: నువ్వెక్కడున్నా నా మనసంతా నీ చుట్టే.. కుమారుడి పుట్టిన రోజున హార్దిక్ పాండ్యా ఎమోషనల్
Hardik Pandya
Follow us on

టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిక్ తో విడిపోయాడు. ఇటీవలే తమ విడాకులను ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందే కుమారుడు అగస్త్యను తీసుకుని తన సొంత దేశం సెర్బియాకు వెళ్లిపోయింది నటాషా. మరోవైపు హార్దిక్ పాండ్యా ప్రస్తుతం శ్రీలంకలో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే జులై 30వ తేదీ హార్దిక్ పాండ్యా జీవితంలో చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఈరోజే అతని కుమారుడు అగస్త్య ఈ లోకంలోకి అడుగు పెట్టాడు. తన కుమారుడి పుట్టిన రోజు సందర్భంగా బాగా ఎమోషనల్ అయ్యాడు హార్దిక్. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్టును షేర్ చేశాడు. తన కుమారుడితో కలిసున్న మధుర క్షణాలను ఈ వీడియోలో పొందు పరిచాడు హార్దిక్.. ‘ నేను ఇలా ముందుకు సాగుతున్నానంటే అందుకు కారణం నువ్వే. నా పార్ట్‌నర్‌ ఇన్‌ క్రైమ్‌. నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నువ్వెక్కడున్నా.. నా మనసంతా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది ఆగూ..! నీపై నాకున్న ప్రేమను వర్ణించేందుకు ఈ మాటలు ఏ మాత్రం చాలవు’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు హార్దిక్. తద్వారా అగస్త్యను ఎంతగా మిస్ అవుతున్నాడో ఈ పోస్టుతో చెప్పకనే చెప్పాడు హార్దిక్.

టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. స్వదేశానికి వచ్చిన హార్దిక్ పాండ్యా తన కుమారుడు అగస్త్యతో కలిసి తన ఇంట్లో సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత నటాషా ఆగస్త్య తీసుకుని సెర్బియాకు వెళ్లిపోయింది. ఇటీవల తన కుమారుడితో కలిసున్న ఫొటోలను నటాషా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. వీటికి స్పందించిన హార్దిక్‌ పాండ్యా హార్ట్‌ సింబల్స్‌తో తన ప్రేమను తెలిపాడు.

ఇవి కూడా చదవండి

కుమారుడు అగస్త్యతో హార్దిక్ పాండ్యా..

కాగా శ్రీలంకతో టీ20 సిరీస్‌ జట్టుకు ఎంపికైన హార్దిక పాండ్యా తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే రెండో టీ20లో మాత్రం అదరగొట్టాడు. రెండు కీలక వికెట్లు తీయడంతో పాటు.. తొమ్మిది బంతుల్లోనే 22 పరుగులు చేసి భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అలాగే టీమిండియా లంకపై టీ20 సిరీస్‌ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు ఈ వరల్డ్‌కప్‌ చాంపియన్‌. ఈ క్రమంలో మంగళవారం (జులై 30) నాటి నామమాత్రపు టీ20కి హార్దిక్ పాండ్యా సిద్ధమవుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..