Hardik Pandya : అది కారు కాదు.. రోడ్డు మీద వెళ్లే విమానం.. గర్ల్ ఫ్రెండ్ కోసం కోట్లు విలువ చేసే కారు గిఫ్ట్ ఇచ్చిన హార్దిక్
Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన ప్రియురాలు మహీకా శర్మ కు రూ. 1.7 కోట్ల విలువైన మెర్సిడెస్ కారును కానుకగా ఇచ్చారు. మరోవైపు ఐపీఎల్ 2026 ఓపెనర్‌లో కేకేఆర్‌పై ముంబై గ్రాండ్ విక్టరీ సాధించింది.

Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్, స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం వార్తల్లో నిలుస్తున్నాడు. మైదానంలో తన ఆటతోనే కాకుండా, బయట తన లగ్జరీ లైఫ్ స్టైల్‌తోనూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా తన ప్రియురాలు మహీకా శర్మకు హార్దిక్ ఒక ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ V-క్లాస్ కారును కానుకగా ఇచ్చాడు. భారత దేశంలోనే ఇటువంటి మోడల్ కారు ఇదే మొదటిదని సమాచారం. దీని విలువ దాదాపు రూ.1.7 కోట్లు ఉంటుందని అంచనా. 2025 అక్టోబర్‌లో వీరిద్దరూ తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించినప్పటి నుంచి, మహీకా ప్రతి మ్యాచ్‌లోనూ హార్దిక్‌కు సపోర్టుగా స్టేడియంలో కనిపిస్తూనే ఉంది. ఇటీవలే భారత్ గెలిచిన టీ20 వరల్డ్ కప్ 2026 వేడుకల్లో కూడా అహ్మదాబాద్ స్టేడియంలో ఆమె సందడి చేసింది.
వ్యక్తిగత జీవితంలోనే కాకుండా, క్రికెట్ గ్రౌండ్‌లో కూడా హార్దిక్ టీమ్ ముంబై ఇండియన్స్ అదరగొట్టింది. ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముంబై చిత్తు చేసింది. కేకేఆర్ నిర్దేశించిన 221 పరుగుల భారీ లక్ష్యాన్ని ముంబై బ్యాటర్లు ఆటలాడుకున్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ (78), రాయన్ రికల్టన్ (81) ఆరంభం నుంచే సిక్సర్ల వర్షం కురిపించారు. వీరిద్దరూ కలిసి కేవలం 71 బంతుల్లోనే 148 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పడం విశేషం. ఈ అద్భుత బ్యాటింగ్‌తో ముంబై 19.1 ఓవర్లలోనే విజయాన్ని అందుకుని, గత 13 ఏళ్లుగా మొదటి మ్యాచ్‌లో ఓడిపోతున్నామన్న అపవాదును చెరిపేసుకుంది.
Hardik Pandya gifted India’s first Mercedes-Benz V-Class to his girlfriend Mahieka sharma today, and its price is around ₹1.7 crore.🫡 pic.twitter.com/JXdn6dD5Jk
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) March 29, 2026
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టులో అజింక్య రహానే (67), కుర్రాడు అంగ్క్రిష్ రఘువంశీ (51) హాఫ్ సెంచరీలతో ముంబై బౌలర్లను పరీక్షించారు. కేకేఆర్ ఒక దశలో 250 పరుగులు దాటేలా కనిపించినా, శార్దూల్ ఠాకూర్ కీలక సమయంలో 3 వికెట్లు తీసి వారిని అడ్డుకున్నాడు. సీనియర్ పేసర్లు ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రాకు వికెట్లు దక్కకపోయినా, బుమ్రా తన చివరి ఓవర్లలో చాలా తక్కువ పరుగులు ఇచ్చి కేకేఆర్ స్కోరును 220 పరుగుల వద్దే కట్టడి చేశాడు. చివరకు ముంబై హోమ్ గ్రౌండ్ వాంఖడేలో ఈ రికార్డు ఛేజింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసి సీజన్‌ను గ్రాండ్‌గా స్టార్ట్ చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
