Sholay 2: షోలే-2 షురూ చేసిన ధోని, హార్దిక్‌ పాండ్యా.. ‘జై-వీరు’ పోజులతో నెట్టింట్లో రచ్చ.. మీరూ ఓ లుక్కేయండి..

|

Jan 26, 2023 | 3:54 PM

Hardik Pandya-Ms Dhoni: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య జనవరి 27న రాంచీలో తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత టీ20 అంతర్జాతీయ జట్టు బుధవారం రాంచీ చేరుకుంది.

Sholay 2: షోలే-2 షురూ చేసిన ధోని, హార్దిక్‌ పాండ్యా.. జై-వీరు పోజులతో నెట్టింట్లో రచ్చ.. మీరూ ఓ లుక్కేయండి..
Follow us on

Hardik Pandya-Ms Dhoni: న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత క్రికెట్ జట్టు క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు జనవరి 27 నుంచి రెండు జట్ల మధ్య అదే సంఖ్యలో మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్ జరగనుంది. హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని టీ20 సిరీస్ నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు మరోసారి విశ్రాంతి లభించింది. తొలి టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ కోసం హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత క్రికెట్ జట్టు బుధవారం రాంచీకి చేరుకుంది. తొలి మ్యాచ్ రాంచీలోని జేఎస్‌సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో జరగనుంది. హార్దిక్ పాండ్యా రాంచీ చేరుకున్న వెంటనే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీని కలిశాడు.

అనంతరం హార్దిక్ ఈ సమావేశానికి సంబంధించి రెండు చిత్రాలను పంచుకున్నారు. దానితో పాటు ‘షోలే 2 త్వరలో వస్తుంది’ అని క్యాఫ్షన్ అందించాడు. వాస్తవానికి హార్దిక్ ఈ ఫోటోలో ధోనీతో జై-వీరు పోజ్ ఇచ్చారు. అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర నటించిన షోలే చిత్రం బాలీవుడ్‌లో అతిపెద్ద హిట్‌లలో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. జై-వీరుల స్నేహం నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

హార్దిక్ పాండ్యా, ధోనీల మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోనీ కెప్టెన్సీలో హార్దిక్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. ఇది మాత్రమే కాదు, ధోని తన కెరీర్‌లో కీలక పాత్ర పోషించాడనే విషయం హార్దిక్ ఎప్పుడూ ప్రస్తావిస్తూనే ఉంటాడు. అంతేకాదు కెప్టెన్సీలో మెలకువలు కూడా ధోని దగ్గరే నేర్చుకున్నానని హార్దిక్ చెప్పాడు. ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడుతున్నాడు. ఐపీఎల్ 2023 ఆటగాడిగా ధోనీకి చివరి సీజన్ కావచ్చని భావిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..