Hardik Pandya: ‘అంతా తూచ్’.. హార్దిక్, నటాషాల విడాకుల రూమర్ల వెనక అసలు కారణమిదే! షాక్‌లో ఫ్యాన్స్

|

May 28, 2024 | 3:17 PM

గత కొన్ని రోజులుగా ఇటు ప్రొఫెషనల్ లైఫ్, అటు పర్సనల్ లైఫ్ లోనూ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ముఖ్యంగా హార్దిక్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అతను తన భార్య నటాషాతో విడాకులు తీసుకోవచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ ఇప్పటికే విడిపోయారని..

Hardik Pandya: అంతా తూచ్.. హార్దిక్, నటాషాల విడాకుల రూమర్ల వెనక అసలు కారణమిదే! షాక్‌లో ఫ్యాన్స్
Hardik Pandya Family
Follow us on

గత కొన్ని రోజులుగా ఇటు ప్రొఫెషనల్ లైఫ్, అటు పర్సనల్ లైఫ్ లోనూ తీవ్ర ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా. ముఖ్యంగా హార్దిక్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమవుతోంది. అతను తన భార్య నటాషాతో విడాకులు తీసుకోవచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అంతేకాదు వీరిద్దరూ ఇప్పటికే విడిపోయారని కూడా చెబుతున్నారు. హార్దిక్ పాండ్యా, నటాషాల విబేధాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయని కొన్ని నివేదికలు కోడై కూస్తున్నాయి. అయితే దీనిపై హార్దిక్ పాండ్యా కానీ, నటాషా కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించిన దాఖలాలు లేవు. హార్దిక్ పాండ్యా, నటాషాల విడాకుల పర్వం కొనసాగుతుండగానే సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ పోస్ట్ చూసిన జనాలు షాక్ అవుతున్నారు. రెడ్డిట్‌లో షేర్ అయిన ఈ పోస్ట్ చూసి అభిమానులు, నెటిజన్లు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. అదేంటంటే.. హార్దిక్ పాండ్యా, నటాషాల విడాకుల వ్యవహారం కేవలం పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనట. ముఖ్యంగా ముంబై కెప్టెన్ గా ఐపీఎల్ లో ఘోరంగా విఫలమైన హార్దిక్ పై అందరి దృష్టిని మరల్చడానికే, అభిమానుల ఆగ్రహాన్ని చల్లార్చడానికి ఈ విడాకుల వ్యవహారాన్ని తెర మీదకు తీసుకొచ్చారని ఈ పోస్ట్ లో తేలింది. దీని ప్రకారమే హార్దిక్ పాండ్యా, నటాషా ఇప్పటికీ విడాకుల గురించి మాట్లాడలేదని ఇందులో రాసి ఉంది.

ప్రస్తుతం ఈపోస్ట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసి అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరి ఈ పోస్ట్ లో ఉన్నద నిజమో? అబద్ధమో? తెలియాలంటే హార్దిక్ దంపతుల్లో ఎవరో ఒకరు స్పందించాల్సిందే. హార్దిక్ పాండ్యా, నటాషా 2020 లో వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. కాగా హార్దిక్ ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ కు అతను సన్నద్ధమవుతున్నాడు.

ఇవి కూడా చదవండి

ఓవైపు ఐపీఎల్ లో నిరాశజనకమైన ప్రదర్శన, మరోవైపు వ్యక్తిగత జీవితంలో ఒడిదొడుకులు.. వీటన్నింటి మధ్య హార్దిక్ ప్రపంచ కప్ లో ఎలా రాణిస్తాడోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..