Andrew Symonds Death: ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్ (Andrew Symonds) శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో యావత్ క్రీడా ప్రపంచం విషాదంలో మునిగిపోయింది. ఆస్ట్రేలియా క్రికెటర్లతో పాటు అతని సమకాలీకులైన మాజీ క్రికెటర్లు, టీమిండియా క్రికెటర్లు, క్రికెట్ అభిమానులు సైమండ్స్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) సైమండ్స్ మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. ‘ఇంత త్వరగా ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయావా మిత్రమా? నీ ఆకస్మిక మరణం విని షాక్ అయ్యాను’ అంటూ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశాడు. సైమండ్స్ ఆత్మకు శాంతి కలగాలని, అతని కుటుంబానికి, సన్నిహితులకు సానుభూతి తెలియజేశాడు భజ్జీ.
బద్ధ శత్రువులను కలిపిన ఐపీఎల్..
కాగా సైమండ్స్-హర్భజన్ సింగ్ మధ్య మంకీ గేట్ వివాదం యావత్ క్రికెట్ ప్రపంచాన్నే కుదిపేసిన విషయం తెలిసిందే. 2008 టీమిండియా ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ఈ వివాదం చెలరేగింది. బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో సైమండ్స్, భజ్జీలు పరస్పరం గొడవకు దిగారు. ఈక్రమంలో హర్భజన్ తనను మంకీ అని పిలిచాడని, జాతి వివక్ష కామెంట్లతో దూషించాడని సైమండ్స్ ఆరోపించాడు. అయితే విచారణలో హర్భజన్.. సైమండ్స్‌ని మంకీ అనలేదని క్రీజులో నాన్ స్ట్రైయికింగ్ ఎండ్‌లో ఉన్న సచిన్ సాక్ష్యం చెప్పడంతో ఈ వివాదం మరో మలుపు తిరిగింది. చేయని తప్పుకు భజ్జీపై ఐసీసీ మూడు మ్యాచ్‌ల నిషేధం విధించింది. దీంతో ఆస్ట్రేలియా క్రికెట్ ప్రవర్తనతో విసిగిపోయిన టీమిండియా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకునేందుకు సిద్ధమైంది. దీంతో వెనక్కు తగ్గిన ఐసీసీ భజ్జీపై నిషేధాన్ని ఎత్తి వేసింది. అయితే ఐపీఎల్ ఈ ఇద్దరు బద్ధ శత్రువులను కలిపింది. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ జెర్సీ ధరించి జట్టుకు సమష్ఠిగా విజయాలు అందించారు. అప్పుడే మంచి మిత్రులుగా మారిపోయారు. పాత గోడవలన్నీ మర్చిపోయి కలిసిమెలసి తిరిగారు.
Shocked to hear about the sudden demise of Andrew Symonds. Gone too soon. Heartfelt condolences to the family and friends. Prayers for the departed soul ?#RIPSymonds
— Harbhajan Turbanator (@harbhajan_singh) May 15, 2022
మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..
Also Read: