IPL 2022 CSK vs GT Score: రాణించిన గుజరాత్ బౌలర్లు.. హార్ధిక్ సేన టార్గెట్ ఎంతంటే..
IPL 2022 CSK vs GT Score: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్ బౌలర్లు దాటికి తక్కువ స్కోరుకే పరిమితం అయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగుల మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ ముందు 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని...
IPL 2022 CSK vs GT Score: గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్ బౌలర్లు దాటికి తక్కువ స్కోరుకే పరిమితం అయ్యారు. నిర్ణీత 20 ఓవర్లలో 133 పరుగుల మాత్రమే చేసింది. దీంతో గుజరాత్ ముందు 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక టాస్ గెలిచిన చెన్నై తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. వాంఖడే స్టేడియం హై స్కోరింగ్‌కు వేదికగా మారిన నేపథ్యంలో చెన్నై తొలుత బ్యాటింగ్ చేయడానికి మొగ్గు చూపింది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం చెన్నై బ్యాటర్లు మాత్రం రాణించలేకపోయారు.
చెన్నై బ్యాటర్లలో రుతురాజ్ గైక్వాడ్ చేసిన 53 పరుగులు మాత్రమే అత్యధికం. మొదటి నుంచి గుజరాత్ బౌలర్లు చెన్నై బ్యాటర్లను కట్టిడి చేశారు. దీంతో క్రీజులోకి వచ్చిన ప్లేయర్ వచ్చినట్లు పెవిలియన్ బాట పట్టారు. రుతురాజ్ తర్వాత జగదీశన్ (39*), మొయిన్ అలీ (21) ఫర్వాలేదనిపించారు. డేవన్ కాన్వే (5), శివమ్ దూబే (0), ఎంఎస్ ధోనీ (7) విఫలమయ్యారు. ఇక గుజరాత్ బౌలర్ల విషయానికొస్తే మహ్మద్ షమీ 4 ఓవర్లు వేసి 19 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. తర్వాత రశీద్ ఖాన్, జోసెఫ్, సాయి కిశోర్ ఒక్కో వికెట్‌ను పడగొట్టారు.