IPL 2026: వామ్మో.. శాంసన్ ట్రేడ్ వెనుక అసలు సీక్రెట్ ఇదా.. బుర్ర బద్దలయ్యే స్కెచ్ భయ్యో..
Sanju Samson Trade to CSK Real Reason: వ్యాపారం, క్రీడ కలగలిసిన ఐపీఎల్ వంటి టోర్నీలలో ఇలాంటి వ్యూహాత్మక మార్పులు సహజమే. అయితే, ధోనీ తర్వాత సిఎస్కేకు సరైన క్రేజ్ ఉన్న ఆటగాడిగా సంజూ శాంసన్ నిలవడం ఖాయమని విహారి మాటలు సూచిస్తున్నాయి.

Sanju Samson commercial value in IPL: ఐపీఎల్ 2026 వేలానికి ముందే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లోకి రావడం, ప్రతిగా రవీంద్ర జడేజా రాజస్థాన్ జట్టుకు వెళ్లడం క్రికెట్ ప్రపంచాన్ని ఊపేసింది. అయితే, ఈ ట్రేడింగ్ వెనుక ఉన్న అసలు కారణం క్రికెట్ నైపుణ్యం కంటే ‘కమర్షియల్ వాల్యూ’ (వ్యాపార విలువ) అని టీమిండియా ఆటగాడు హనుమ విహారి విశ్లేషించాడు.
వ్యాపారమే ప్రధానం..
తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో విహారి మాట్లాడుతూ, ఐపీఎల్ అనేది కేవలం ఆట మాత్రమే కాదని, అది భారీ వ్యాపారంతో కూడుకున్నదని పేర్కొన్నాడు. “దక్షిణ భారతదేశంలో సంజూ శాంసన్‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అసాధారణం. ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులు కేవలం మైదానంలో ఆటను మాత్రమే చూడరు. ఒక ఆటగాడు జట్టుకు ఎంతటి బ్రాండ్ వాల్యూ, కమర్షియల్ మైలేజీని తీసుకువస్తాడో కూడా లెక్కిస్తారు” అని విహారి తెలిపాడు.
ఓపెనర్ల అవసరం లేకపోయినా..
చెన్నై జట్టులో ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్, ఆయుష్ మ్హాత్రే, ఉర్విల్ పటేల్ వంటి ప్రతిభావంతులైన ఓపెనర్లు ఉన్నారని విహారి గుర్తు చేశాడు. “నిజానికి చెన్నైకి మరో ఓపెనర్ అవసరం లేదు. కానీ సంజూ కేరళకు చెందిన వాడు కావడం వల్ల అతనికి సౌత్ ఇండియాలో భారీ క్రేజ్ ఉంది. ఎక్కడ మ్యాచ్ జరిగినా కేరళ ఫ్యాన్స్ సంజూ కోసం స్టేడియాలకు తరలివస్తారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడమే సిఎస్కే ప్లాన్” అని ఆయన వివరించాడు.
ఇది కూడా చదవండి: CSK Franchise: ఫ్యాన్స్‌కు బ్యాడ్‌న్యూస్.. సీజన్ మొత్తానికి చెన్నై కెప్టెన్ దూరం..
సంజూ పాత్ర ఏంటి?
ఓపెనింగ్ స్లాట్ నిండిపోయి ఉండటంతో, సంజూ శాంసన్‌ను ఈ సీజన్‌లో నెంబర్ 3 స్థానంలో ఆడించే అవకాశం ఉందని విహారి అంచనా వేశాడు. గత సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున కూడా అతను అదే స్థానంలో రాణించడాన్ని విహారి ప్రస్తావించాడు. కేవలం క్రికెట్ అవసరాల కోసమే అయితే ఈ ట్రేడింగ్ జరగకపోవచ్చని, కానీ సంజూ ఇమేజ్, మార్కెట్ వాల్యూ ఈ డీల్‌ను విజయవంతం చేశాయని ఆయన అభిప్రాయపడ్డాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




