AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగబ్బాయ్‌కి సీరియస్ వార్నింగ్.. ఛాన్స్ వస్తే వేస్ట్ చేసుకుంటావేంట్రా బాబు.. కోచ్ ఘాటు వ్యాఖ్యలు

Ryan ten Doeschate on Nitish Kumar Reddy: యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం గొప్ప విషయమే అయినా, వారు వాటిని నిరూపించుకోకపోతే జట్టులో పోటీ పెరిగి స్థానం కోల్పోయే ప్రమాదం ఉంది. మరి మూడో వన్డేలో నితీష్‌కు మరో అవకాశం దక్కుతుందా లేదా అనేది వేచి చూడాలి.

తెలుగబ్బాయ్‌కి సీరియస్ వార్నింగ్.. ఛాన్స్ వస్తే వేస్ట్ చేసుకుంటావేంట్రా బాబు.. కోచ్ ఘాటు వ్యాఖ్యలు
Nitish Kumar Reddy
Venkata Chari
|

Updated on: Jan 15, 2026 | 3:02 PM

Share

Ryan ten Doeschate Critiques Nitish Kumar Reddy: రాజ్‌కోట్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి పాలవ్వడమే కాకుండా, కీలక ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ మ్యాచ్‌లో వాషింగ్టన్ సుందర్ స్థానంలో తుది జట్టులోకి వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ప్రభావం చూపడంలో విఫలమయ్యాడు. దీనిపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోషేట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

కోచ్ చేసిన విమర్శలేంటి..?

మ్యాచ్ అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో టెన్ డోషేట్ మాట్లాడుతూ నితీష్ ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు. “మేం నితీష్‌ను ఒక మంచి ఆల్‌రౌండర్‌గా తీర్చిదిద్దాలని నిరంతరం చర్చిస్తున్నాం. అతనికి తగినంత గేమ్ టైమ్ (ఆడే అవకాశం) ఇస్తున్నాం. కానీ, అవకాశం వచ్చినప్పుడు అతను ఆశించిన స్థాయిలో రాణించడం లేదు” అని పేర్కొన్నాడు.

నితీష్ విఫలమైన తీరు..

రెండో వన్డేలో నితీష్ కుమార్ రెడ్డి బ్యాటింగ్‌లో కేవలం 20 పరుగులు మాత్రమే చేశాడు. ఇక బౌలింగ్‌లో కేవలం రెండు ఓవర్లు మాత్రమే వేసి వికెట్ తీయకుండా 13 పరుగులు ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

బ్యాటింగ్ వైఫల్యం..

క్రీజులో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను నిర్మించే అవకాశం ఉన్నా, దానిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు.

బౌలింగ్ ప్రభావం..

ఆల్‌రౌండర్‌గా జట్టులో ఉన్నప్పుడు కనీసం ఐదు నుంచి ఆరు ఓవర్లు వేసి వికెట్లు తీయాల్సి ఉంటుంది, కానీ కెప్టెన్ అతనికి ఎక్కువ ఓవర్లు ఇచ్చే సాహసం చేయలేదు.

మేనేజ్‌మెంట్ ప్రణాళికలు..

భవిష్యత్ అవసరాల దృష్ట్యా హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా నితీష్‌ను సిద్ధం చేయాలని బోర్డు భావించింది. అయితే, గత కొన్ని మ్యాచ్‌లుగా అతను తన నైపుణ్యాన్ని నిరూపించుకోలేకపోతున్నాడు. ఇదే విషయాన్ని డోషేట్ గుర్తు చేస్తూ, “జట్టులో చోటు సంపాదించాలంటే వచ్చిన అవకాశాలను ఒడిసిపట్టుకోవాలి. కానీ నితీష్ విషయంలో అది జరగడం లేదు” అని బాహాటంగానే విమర్శించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కుజుడు బలపడాలంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్యుడి పూజతో సంబంధమేంటి?
కుజుడు బలపడాలంటే ఏం చేయాలి? సుబ్రహ్మణ్యుడి పూజతో సంబంధమేంటి?
ఇకపై ఇక్కడ కూడా.. రేపే మహేష్ 'ఏఎంబీ సినిమాస్' గ్రాండ్ ఓపెనింగ్
ఇకపై ఇక్కడ కూడా.. రేపే మహేష్ 'ఏఎంబీ సినిమాస్' గ్రాండ్ ఓపెనింగ్
తెలుగబ్బాయ్‌కి సీరియస్ వార్నింగ్.. కోచ్ ఘాటు వ్యాఖ్యలు
తెలుగబ్బాయ్‌కి సీరియస్ వార్నింగ్.. కోచ్ ఘాటు వ్యాఖ్యలు
గుడికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
గుడికి వెళ్తుండగా వెంటాడిన మృత్యువు.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి
మీ విద్యుత్‌ మీటర్‌లో రెడ్‌ లైట్‌ వెలుగుతుందా? కారణం ఏంటో తెలుసా?
మీ విద్యుత్‌ మీటర్‌లో రెడ్‌ లైట్‌ వెలుగుతుందా? కారణం ఏంటో తెలుసా?
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
టాలీవుడ్ కు సెకండ్ హోమ్ గా మారుతున్న జపాన్ వీడియో
అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ ఎంత తీసుకునేదంటే..
అప్పట్లో సౌందర్య రెమ్యునరేషన్ ఎంత తీసుకునేదంటే..
Vastu Tips: ఆఫీసులో ఏ దేవుళ్లు, దేవతల ఫోటోలు ఉండాలో తెలుసా? ఎలాంట
Vastu Tips: ఆఫీసులో ఏ దేవుళ్లు, దేవతల ఫోటోలు ఉండాలో తెలుసా? ఎలాంట
బంగ్లాదేశ్‌లో ముదిరిన సంక్షోభం.. మ్యాచ్‌లు బహిష్కరించిన ప్లేయర్లు
బంగ్లాదేశ్‌లో ముదిరిన సంక్షోభం.. మ్యాచ్‌లు బహిష్కరించిన ప్లేయర్లు