Video: వైభవ్ పక్కనే దొరికిన మరో వజ్రం.. తొలి మ్యాచ్‌లోనే గడగడలాడించిన టీమిండియా స్పీడ్ గన్..
Who is Henil Patel India U19 bowler: అండర్-19 స్థాయిలో హెనిల్ పటేల్ కనబరిచిన ఈ ప్రదర్శన చూస్తుంటే, భవిష్యత్తులో టీమిండియా సీనియర్ జట్టులోకి మరో నాణ్యమైన పేసర్ రావడం ఖాయంగా కనిపిస్తోంది. టోర్నీ ఆరంభంలోనే ఇంతటి ఆధిపత్యాన్ని ప్రదర్శించడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.

United States of America U19 vs India U19: జింబాబ్వే వేదికగా ప్రారంభమైన ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ 2026లో భారత జట్టు శుభారంభం చేసింది. గ్రూప్-ఏలో భాగంగా గురువారం (జనవరి 15, 2026) అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత యువ బౌలర్ హెనిల్ పటేల్ (Henil Patel) తన ప్రతాపాన్ని చూపించాడు. కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి అమెరికా బ్యాటింగ్ వెన్నెముకను విరిచాడు.
హెనిల్ పటేల్ ఎవరు?
హెనిల్ దిలీప్‌భాయ్ పటేల్ ఫిబ్రవరి 27, 2007న గుజరాత్‌లోని వల్సాద్‌లో జన్మించాడు. కుడిచేతి వాటం మీడియం ఫాస్ట్ బౌలర్ అయిన హెనిల్, దేశవాళీ క్రికెట్‌లో గుజరాత్ అండర్-19 జట్టు తరపున ఆడుతున్నాడు. గత కొంతకాలంగా అండర్-19 వన్డేలు, టెస్టుల్లో నిలకడగా రాణిస్తూ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా బంతిని రెండు వైపులా స్వింగ్ చేయగల సామర్థ్యం ఇతని ప్రత్యేకత.
అమెరికాపై ఐదు వికెట్ల మాయాజాలం..
బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
తొలి స్పెల్‌లో విధ్వంసం..
Henil Patel, remember the name! 🌪️ 7 overs, 16 runs aur 5 bade wickets. USA ke batters ke paas unki swing aur bounce ka koi jawaab nahi tha. Top class bowling! 🔥 #HenilPatel#INDvsUSA #U19WorldCup pic.twitter.com/gJz2vgdB3n
— Sports Warta (@Sportswarta) January 15, 2026
ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఓపెనర్ అమ్రీందర్ గిల్‌ను అవుట్ చేసి భారత్‌కు తొలి బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత వరుసగా అమెరికా కెప్టెన్ ఉత్కర్ష్ శ్రీవాస్తవ, అర్జున్ మహేష్‌లను పెవిలియన్‌కు పంపి అమెరికాను కోలుకోలేని దెబ్బ తీశాడు.
ఐదు వికెట్ల ఘనత (5/16)..
మ్యాచ్ చివరలో తిరిగి వచ్చి సబ్రిష్ ప్రసాద్, రిషబ్ షింపిలను అవుట్ చేయడం ద్వారా తన ఐదు వికెట్ల మైలురాయిని పూర్తి చేశాడు. అతని గణాంకాలు: 7 ఓవర్లు, 1 మెయిడెన్, 16 పరుగులు, 5 వికెట్లు. హెనిల్ ధాటికి అమెరికా కేవలం 107 పరుగులకే కుప్పకూలింది.
మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ప్రదర్శన..
హెనిల్ పటేల్ ప్రదర్శన కేవలం గణాంకాలకే పరిమితం కాలేదు. పిచ్‌పై ఉన్న తేమను, బౌన్స్‌ను చక్కగా వాడుకుంటూ కచ్చితమైన లెంగ్త్‌లో బౌలింగ్ చేసి విశ్లేషకుల ప్రశంసలు అందుకున్నాడు. ఈ మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసే బౌలర్ల జాబితాలో హెనిల్ ముందంజలో ఉండే అవకాశం కనిపిస్తోంది.
మ్యాచ్ పరిస్థితి..
ప్రస్తుతం అమెరికా జట్టు 35.2 ఓవర్లకు 107 పరుగులకు ఆలౌట్ అయింది. కాగా, వర్షంతో టీమిండియా ఛేజింగ్ ఆలస్యం అవుతోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




