మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ గురించి ఇండియన్ ప్లేయర్ హనుమ విహారి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు. తన కెరియర్‌లో రాహుల్ ద్రావిడ్ చాలా కీలకమైన వ్యక్తిగా అభివర్ణించాడు. తనలో ఆత్మవిశ్వాసం నింపాడని వివరించాడు. సిడ్నీ టెస్టు ముగిసిన వెంటనే రాహుల్ ద్రవిడ్ తనకు సందేశం పంపించారని పేర్కొన్నాడు. గొప్పగా ఆడావని ప్రశంసల జల్లు కురిపించారన్నారు.
ద్రావిడ్ ఎంతో గొప్ప వ్యక్తి అని, అతడిని ఎంతగానో ఆరాధిస్తానని, నిజానికి అతడి వల్లే రంజీలు, టీమ్‌ఇండియా మధ్య అంతరం తొలగిపోయిందని చెప్పాడు. భారత్-ఏకు ఆడుతున్నప్పుడు తమను తాము నిరూపించుకొనేలా స్వేచ్ఛనిచ్చేవారని కొనియాడారు. సిరాజ్, సైని, శుభ్‌మన్, మయాంక్, తను కలిసి భారత్-ఏకు ఆడామని 3-4 ఏళ్లు ఆయన తమకు కోచింగ్ ఇచ్చారని చెప్పుకొచ్చాడు. ద్రావిడ్ వల్లే ఈ రోజు మేము ఇలా ఆడగలుగుతున్నామని అన్నాడు.
Thailand Open : థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్టోర్నీలో భారత ఆటగాళ్ల దూకుడు.. క్వార్టర్స్లోకి సింధు