Ind vs Eng : భారత పర్యటనకు ఇంగ్లండ్ జట్టు ఎంపిక.. టీమ్‌లోకి ఆ ముగ్గురి రీ ఎంట్రీ

భారత్‌తో జరిగే తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్‌ టీమ్‌ను ఈసీబీ ప్రకటించారు. శ్రీలంక టూర్‌కు విశ్రాంతినిచ్చిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌, రోరి బర్న్స్‌కు టీమ్‌లో రీఎంట్రీ...

Ind vs Eng : భారత పర్యటనకు ఇంగ్లండ్ జట్టు ఎంపిక.. టీమ్‌లోకి ఆ ముగ్గురి రీ ఎంట్రీ
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 22, 2021 | 5:54 AM

England tour of India : భారత్‌తో జరిగే తొలి రెండు టెస్ట్‌లకు ఇంగ్లండ్‌ టీమ్‌ను ఈసీబీ ప్రకటించారు. శ్రీలంక టూర్‌కు విశ్రాంతినిచ్చిన ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌, పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌, రోరి బర్న్స్‌కు టీమ్‌లో రీఎంట్రీ ఇచ్చారు. విధ్వంసకర ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌, పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ తిరిగి జట్టులో రావడంతో ఆ జట్టు బలం కొద్దిగా పెరిగింది. జో రూట్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. కరోనా బారినపడి కోలుకొన్న మొయిన్‌ అలీకి టీమ్‌లో చోటుదక్కింది. చెన్నై వేదికగా జరిగే తొలి రెండు టెస్టులు జరుగనున్నాయి. అంతేకాకుండా మరో ఆరుగురు రిజర్వు ఆటగాళ్లను ఎంపిక చేసింది.

శ్రీలంక టూర్‌ ముగిసిన తర్వాత నేరుగా చెన్నై చేరుకోనుంది ఇంగ్లండ్‌ జట్టు.  మూడు ఫార్మాట్లలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లకు విశ్రాంతినివ్వాలన్న విధానంతో స్టోక్స్‌, ఆర్చర్‌ను లంక సిరీసుకు ఎంపికచేయలేదు. ఇక ఫిట్‌నెస్‌ సాధించిన వెంటనే ఒలీవ్‌ పోప్‌ భారత్‌కు వచ్చేస్తాడు.

గతేడాది సెప్టెంబర్లో పాక్ ‌సిరీస్‌లో ఒలీవ్ పోప్ భుజానికి గాయమైంది. అంతే కాదు లంక పర్యటనలో కొవిడ్‌ పాజిటివ్‌గా తేలిన మొయిన్‌ అలీ కోలుకొని జట్టులో చేరాడు. బెయిర్‌ స్టో, సామ్‌ కరన్‌, మార్క్‌వుడ్‌కు సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు. వారిప్పుడు లంకలో ఉన్నారు.

ఇంగ్లండ్‌ జట్టు: రూట్‌, ఆర్చర్‌, మొయిన్‌ అలీ, అండర్సన్‌, బెస్‌, బ్రాడ్‌, రోరి బర్న్స్‌, బట్లర్‌, జాక్‌ క్రాలే, బెన్‌ ఫోక్స్‌, లారెన్స్‌, జాక్‌ లీచ్‌, స్టోక్స్‌, ఒల్లీ స్టోన్‌, క్రిస్‌ ఓక్స్‌.

ఇవి కూడా చదవండి :

 Sasikala Tests Positive : శశికళ అభిమానులకు భారీ షాక్.. చిన్నమ్మకు కరోనా పాజిటివ్..  Strong earthquake : ఫిలిప్పైన్స్‌లో భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు..