ఇండోనేషియా విమాన ప్రమాద ఘటనపై వీడని చిక్కుముడి.. గాలింపు చర్యలను నిలిపివేసిన అధికారులు..

ఇండోనేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్లుగా ఆదేశం ప్రటకించింది. అయితే విమాన కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ కోసం మాత్రం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించింది.

  • Sanjay Kasula
  • Publish Date - 5:57 am, Fri, 22 January 21
ఇండోనేషియా విమాన ప్రమాద ఘటనపై వీడని చిక్కుముడి.. గాలింపు చర్యలను నిలిపివేసిన అధికారులు..

Ends Search For Plane : ఇండోనేషియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదానికి సంబంధించిన గాలింపు చర్యలను నిలిపివేస్తున్నట్లుగా ఆదేశం ప్రటకించింది. అయితే విమాన కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డర్‌ కోసం మాత్రం తనిఖీలు కొనసాగుతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ చీఫ్‌ బాగస్‌ పురుహితో ఈ వివరాలను తెలిపారు.

గాలింపు చర్యల్లో ఇప్పటివరకూ 324 సంచుల శరీరభాగాలు, విమాన భాగాలు సేకరించగలినట్లుగా ప్రకటించారు. ఇండోనేషియాకు చెందిన శ్రీ విజయ సంస్థకు చెందిన విమానం ఎస్‌కే 182 జనవరి 9న ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. జకార్తా నుంచి టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే జావా సముద్రంలో కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న 62 మంది ప్రయాణికులు జలసమాధి అయి ఉంటారని ఆ దేశ అధికారులు వెల్లడించారు.