బంగ్లా, నేపాల్ చేరుకున్న కరోనా వ్యాక్సిన్ ట్రక్కులు.. ఇదే స్నేహానికి ప్రతీక అంటూ ట్వీట్ చేసిన ఇరు దేశాలు..

భారత్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకుంటోంది. పొరుగు దేశాలతో సంబంధాలే తొలి ప్రాధాన్యతగా అడుగులు వేస్తోంది. బంగ్లా, నేపాల్‌లకు భారత్‌ ..

బంగ్లా, నేపాల్ చేరుకున్న కరోనా వ్యాక్సిన్ ట్రక్కులు.. ఇదే స్నేహానికి ప్రతీక అంటూ ట్వీట్ చేసిన ఇరు దేశాలు..
Sanjay Kasula

|

Jan 22, 2021 | 6:10 AM

Covid Vaccine Gift : భారత్ తన దాతృత్వాన్ని మరోసారి చాటుకుంటోంది. పొరుగు దేశాలతో సంబంధాలే తొలి ప్రాధాన్యతగా అడుగులు వేస్తోంది. బంగ్లా, నేపాల్‌లకు భారత్‌ నుంచి కొవిడ్‌-19 టీకాలు చేరుకున్నాయి. పొరుగు దేశాలకు ఔషధ సాయంలో భాగంగా బంగ్లాదేశ్‌కు 2 మిలియన్లు, నేపాల్‌కు 1 మిలియన్‌ టీకా డోసులను భారత్‌ సరఫరా చేసింది.

ఆ వ్యాక్సిన్ డోసులు గురువారం ఆయా దేశాలకు చేరుకున్నాయి. బంగ్లాదేశ్‌కు చేరుకున్న 2 మిలియన్ల టీకాలను ఆ దేశ విదేశాంగ మంత్రి డా.ఏకే అబ్దుల్‌ మోమెన్‌కు భారత హై కమిషనర్‌ విక్రమ్‌ దొరైస్వామి అందజేశారు. భారత్‌.. 1971లో లిబరేషన్‌ వార్‌ సమయంలో బంగ్లాదేశ్‌కు మద్దతుగా నిలిచిందని మోమెన్ అన్నారు.

మళ్లీ ఈ రోజు కరోనా వైరస్‌ మహమ్మారి సంక్షోభ సమయంలోనూ భారత్‌ మాకు అండగా నిలుస్తోందని కొనియాడారు. భారత్‌ చేపట్టే ఇలాంటి కార్యక్రమాలే రెండు దేశాల మధ్య ఉన్న స్నేహానికి ప్రతీక అని చెప్పుకొచ్చారు. నేపాల్‌లో టీకాలను అందుకున్న అనంతరం ఆ దేశ ప్రధాని కేపీ శర్మ ఓలీ ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. భారత ప్రధాని నరేంద్రమోదీకి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

ఇవి కూడా చదవండి :

Sasikala Tests Positive : శశికళ అభిమానులకు భారీ షాక్.. చిన్నమ్మకు కరోనా పాజిటివ్..

Strong earthquake : ఫిలిప్పైన్స్‌లో భారీ భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్‌పై 7.0గా నమోదు..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu