PBKS vs GT: పంజాబ్ కింగ్స్ మట్టికరిపించిన గుజరాత్ ..ఆరు వికెట్ల తేడాతో హార్దిక్ సేన్ విజయం
మొహాలీలోని పీసీఏ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకొని రంగంలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 153 పరుగులుమాత్రమే చేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో గుజరాత్ టైటాన్స్ , పంజాబ్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్ రసావత్రరంగా సాగింది. మొహాలీలోని పీసీఏ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకొని రంగంలోకి దిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లు ముగిసేసరికి 7 వికెట్ల నష్టానికి 153 పరుగులుమాత్రమే చేసింది. దీంతో గుజరాత్ టైటాన్స్ ముందు 154 పరుగుల టార్గెట్ నిలిచింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టైటాన్స్ ఎంతో చాకచక్యంగా ఆడి విజయాన్ని సొంతం చేసుకున్నారు. టైటన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో మ్యాచ్‌లో హార్దిక్ సేన ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది.
గుజరాత్ టైటాన్స్ 19.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ ను ఛేదించింది. శుభ్‌మన్ గిల్ 67 పరుగులు 49 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్ అర్ధ శతకంతో మెరిశాడు. వృద్ధిమాన్ సాహా 30 పరుగులు 19 బంతుల్లో 5 ఫోర్లు, సాయి సుదర్శన్ 19పరుగులు 20 బంతుల్లో 2 ఫోర్లు. డేవిడ్ మిల్లర్ 17పరుగులు , రాహుల్ తెవాతియా 5 పరుగులు , హార్దిక్ పాండ్య 8 పరుగులు చేశారు.
పంజాబ్ బ్యాటర్లలో మాథ్యూ షార్ట్ 36 పరుగులు 24 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్ రాణించగా.. జితేశ్ శర్మ 25 పరుగులు 23 బంతుల్లో 5 ఫోర్లు , సామ్ కరన్ 22 పరుగులు , షారూఖ్ ఖాన్ 22 పరుగులు, భానుక రాజపక్స 20 పరుగులు చేశారు. ఇక మోహిత్ శర్మ రెండు, షమి, లిటిల్, అల్జారీ జోసెఫ్, రషీద్ ఖాన్ ఒక్కో వికెట్ సాధించారు.