
Gujarat Titans vs Royal Challengers Bengaluru: ఐపీఎల్ రెండో దశలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చెలరేగి ఆడుతోంది. మొన్నటికి మొన్న పటిష్ఠమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ను చిత్తు చేసిన ఆర్సీబీ తాజాగా లక్నో గుజరాత్ టైటాన్స్ ను ఓడించింది. తద్వారా వరుసగా రెండో విజయాన్ని, ఓవరాల్ గా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం (ఏప్రిల్ 27) జరిగిన మ్యాచ్ లో మొదట గుజరాత్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 200 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన ఆర్సీబీ మరో 4 ఓవర్లు మిగిలి ఉండగానే కేవలం ఒక వికెట్ కోల్పోయి టార్గెట్ ను అందుకుంది. విల్ జాక్స్ (41 బంతుల్లో 100 నాటౌట్, 5 ఫోర్లు, 10 సిక్సర్లు) సెంచరీతో చెలరేగగా, విరాట్ కోహ్లీ (44 బంతుల్లో 70 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) క్యామియో ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా 16 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 206 పరుగులు చేసి 9 వికెట్ల విజయాన్ని అందుకుంది ఆర్సీబీ. రవిశ్రీనివాసన్ ఒక వికెట్ రాబట్టుకున్నాడు. ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడిన బెంగళూరు జట్టుకు ఇది మూడో విజయం. ఈ గెలుపుతో ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది కోహ్లీ అండ్ టీమ్.
A memorable chase from @RCBTweets ✨
ఇవి కూడా చదవండిAn partnership of 1️⃣6️⃣6️⃣* between Virat Kohli & Will Jacks power them to 🔙 to 🔙 wins ❤️
Will their late surge help them qualify for the playoffs?🤔
Scorecard ▶️ https://t.co/SBLf0DonM7#TATAIPL | #GTvRCB pic.twitter.com/3J5O4vCVnM
— IndianPremierLeague (@IPL) April 28, 2024
గుజరాత్ టైటాన్స్ – వృద్ధిమాన్ సాహా(కీపర్), శుబ్మాన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, షారుక్ ఖాన్, రషీద్ ఖాన్, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ.
సందీప్ వారియర్, శరత్ బీఆర్, మానవ్ సుతార్, దర్శన్ నల్కండే, విజయ్ శంకర్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు – విరాట్ కోహ్లీ, ఫాఫ్ డు ప్లెసిస్(కెప్టెన్), విల్ జాక్స్, రజత్ పటీదార్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, దినేష్ కార్తీక్(కీపర్), స్వప్నిల్ సింగ్, కర్ణ్ శర్మ, మహ్మద్ సిరాజ్, యశ్ దయాల్.
అనుజ్ రావత్, మహిపాల్ లోమ్రోర్, హిమాన్షు శర్మ, ఆకాష్ దీప్, విజయ్‌కుమార్ వైషాక్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..