GG vs MI, WPL 2023 Highlights: టోర్నీ తొలి మ్యాచ్‌లోనే గుజరాత్‌ను చిత్తు చేసిన ముంబై.. 143 పరుగుల తేడాతో భారీ విజయం..
టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 208 పరుగులు భారీ టార్గెట్ ఉంచింది.
GG vs MI, WPL 2023 Live Score: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) తొలి సీజన్ తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య కొనసాగుతోంది. టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 208 పరుగులు భారీ టార్గెట్ ఉంచింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ తుఫాన్ ఇన్నింగ్స్‌తో అలరించింది. ఈ క్రమంలో కేవలం 30 బంతుల్లోనే 65 పరుగులు(14 ఫోర్లు) సాధించింది. లీగ్‌లో హర్మన్‌ప్రీత్ తొలి అర్ధ సెంచరీ నమోదు చేసింది.
ఓపెనింగ్ వేడుకు ముగిశాయి. కియారా అద్వానీ డ్యాన్స్‌తో ప్రారంభోత్సవ వేడుక ప్రారంభమైంది. ఆపై కీర్తి సనన్, ఏపీ ధిల్లాన్ వేదికపైకి వచ్చారు. అనంతరం ఐదు జట్ల కెప్టెన్లు రంగంలోకి దిగి ట్రోఫీని ఆవిష్కరించారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ వేడుక జరిగింది.
It was Mumbai Indians all the way in the opening contest of the WPL!https://t.co/m18JNRbXs9 #WPL2023 #GGvMI pic.twitter.com/KzW5PSZ4XW
— ESPNcricinfo (@ESPNcricinfo) March 4, 2023
ఈ రోజు ప్రారంభమయ్యే ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL) ప్రారంభ వేడుకతో మొదలవుతోంది. తొలి మ్యాచ్‌కు రెండు గంటల ముందు ఈ ప్రారంభ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలో బాలీవుడ్ నటీమణులు కియారా అద్వానీ, కృతి సనన్ బ్యాంగ్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు. ఇక ప్రముఖ గాయకుడు ఏపీ ధిల్లాన్ తన పాటలతో ప్రేక్షకులను అలరించనున్నారు.
తొలి మ్యాచ్ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. ఇటువంటి పరిస్థితిలో ప్రారంభ వేడుక 6.25 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ వేడుకకు సాయంత్రం 4 గంటలకు డీవై పాటిల్ స్టేడియంలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
ప్రారంభోత్సవం అనంతరం ముంబై, గుజరాత్ జట్ల మధ్య తొలిపోరు జరగనుంది. దాదాపు రెండు గంటలపాటు ఈ ప్రారంభోత్సవ వేడుక జరగనుంది. ఆ తర్వాత రాత్రి 7:30 గంటలకు టాస్ ఉంటుంది. రాత్రి 8 గంటలకు WPLలో మొదటి బంతి పడనుంది. WPL మొదటి సీజన్‌లో ముంబై ఇండియన్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య మొదటి మ్యాచ్‌లో తలపడనున్నాయి. ముంబయికి హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యం వహిస్తుండగా, గుజరాత్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ బెత్ మూనీ కెప్టెన్‌గా ఉంది.
ప్రత్యక్ష ప్రసారాన్ని ఎక్కడ చూడాలి?
మహిళల ప్రీమియర్ లీగ్ ప్రారంభోత్సవం ప్రత్యక్ష ప్రసారం స్పోర్ట్స్-18 1, స్పోర్ట్స్-18 1HD ఛానెల్‌లలో ప్రసారం కానుంది. ఈ వేడుక లైవ్ స్ట్రీమింగ్ Jio సినిమా యాప్‌లో అందుబాటులో ఉంటుంది.
LIVE Cricket Score & Updates
-
గుజరాత్ టార్గెట్ 208
టాస్ గెలిచిన గుజరాత్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 207 పరుగులు చేసింది. దీంతో గుజరాత్ ముందు 208 పరుగులు భారీ టార్గెట్ ఉంచింది.
-
హర్మన్‌ప్రీత్ కౌర్ హాఫ్ సెంచరీ..
ముంబై తరపున హర్మన్‌ప్రీత్ కౌర్, అమేలియా కెర్ మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం పూర్తయింది. వీరిద్దరి మధ్య 68 పరుగుల భాగస్వామ్యం ఉంది. కెర్ 25 పరుగులు చేయగా, హర్మన్‌ప్రీత్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. హర్మన్ 22 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో మొత్తం 51 పరుగులు చేసింది.
-
-
గుజరాత్ జెయింట్స్ ప్లేయింగ్ 11..
గుజరాత్ జెయింట్స్: బెత్ మూనీ (కెప్టెన్), షబ్బినేని మేఘన, హర్లీన్ డియోల్, ఆష్లే గార్డనర్, అన్నాబెల్ సదర్లాండ్, హేమలతా దయాలన్, జార్జియా వేర్‌హామ్, స్నేహ రాణా, తనూజా కన్వర్, మోనికా పటేల్, మానసి జోషి.
-
MUM vs GG: ముంబై జట్టు..
ముంబై ఇండియన్స్ – హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), యాస్తికా భాటియా, నేట్ సీవర్-బ్రంట్, హేలీ మాథ్యూస్, పూజా వస్త్రాకర్, ఇసాబెల్ వాంగ్, హుమైరా కాజీ, అమేలీ కర్, అమంజోత్ కౌర్, జింటిమణి కలితా, సైకా ఇషాక్.
-
టాస్ గెలిచిన గుజరాత్..
టాస్ గెలిచిన గుజరాత్ జెయింట్స్ కెప్టెన్ బెత్ మూనీ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లను తమ జట్టులోకి తీసుకోవాలని గుజరాత్ నిర్ణయించుకుంది.
-
-
ముగిసిన వేడుకలు..
ఓపెనింగ్ వేడుకు ముగిశాయి. కియారా అద్వానీ డ్యాన్స్‌తో ప్రారంభోత్సవ వేడుక ప్రారంభమైంది. ఆపై కీర్తి సనన్, ఏపీ ధిల్లాన్ వేదికపైకి వచ్చారు. అనంతరం ఐదు జట్ల కెప్టెన్లు రంగంలోకి దిగి ట్రోఫీని ఆవిష్కరించారు. దాదాపు 30 నిమిషాల పాటు ఈ వేడుక జరిగింది.
-
కెప్టెన్ల ఎంట్రీ..
త్రీ స్టార్స్ పర్ఫామెన్స్ తర్వాత బీసీసీఐ అధికారులంతా వేదికపైకి వచ్చారు. ఆ తర్వాత అన్ని జట్ల కెప్టెన్లు ఎంట్రీ ఇస్తున్నారు.
-
ఏపీ ధిల్లాన్ పాటలతో హోరెక్కిన మైదానం..
కియారా, కీర్తి తర్వాత ఇప్పుడు గాయకుడు ఏపీ ధిల్లాన్ వేదికపైకి వచ్చాడు. బ్రౌన్ ముండే పాటతో ప్రారంభించాడు. స్టేడియం మొత్తం ఆయన పాటలతో మార్మోగిపోతోంది.
-
కీర్తి సనన్ డ్యాన్స్ షో..
కియారా డ్యాన్స్ తర్వాత కీర్తి సనన్ వేదికపైకి వచ్చింది. చక్ దే ఇండియాలోని ‘బాదల్ పర్ పాన్ హై’ పాటతో ప్రారంభించింది. సనన్ కూడా దాదాపు 10 నిమిషాల్లో వేదికపై ప్రదర్శన ఇచ్చింది.
-
WPL ప్రారంభానికి ముందు వివాదం..
డబ్ల్యుపీఎల్ ప్రారంభానికి కొంత సమయమే ఉంది. కానీ, అంతకు ముందు ఓ వివాదం నెలకొంది. మీడియా నివేదికల ప్రకారం, గుజరాత్ జెయింట్స్‌కు చెందిన డియాండ్రా డాటిన్ గాయం కారణంగా తప్పుకున్నట్లు గుజరాత్ ప్రకటించింది. అయితే తాజాగా ఈ ప్లేయర్ తనకు గాయం కాలేదని చెప్పడంతో.. వివాదం నెలకొంది.
-
గుజరాత్‌కు భారీ షాక్..
ముంబైతో మ్యాచ్‌కు ముందు గుజరాత్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్‌కు చెందిన డియాండ్రా డాటిన్ గాయం కారణంగా లీగ్‌కు దూరమయ్యాడు. ఆమె స్థానంలో గుజరాత్ జట్టు కిమ్ గార్డ్‌ను చేర్చుకుంది.
-
ఏపీ ధిల్లాన్‌తో కలిసి పాడిన హర్లీన్-జెమీమా
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ వేడుకలకు ముందు, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్ గాయకుడు ఏపీ ధిల్లాన్‌తో కలిసి ఒక పాట పాడారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు.
? Sound ?
Locker room jam session ft. @JemiRodrigues, @imharleenDeol & @apdhillxn ? ?
Catch him perform LIVE at the grand opening ceremony at the D Y Patil Stadium tonight ✨#TATAWPL pic.twitter.com/z1HWFD5kin
— Women’s Premier League (WPL) (@wplt20) March 4, 2023
-
థీమ్ సాంగ్ వింటే గూస్ బమ్స్..
Dham dha ma ma dham!
The #TATAWPL anthem is finally here! Witness the energy & enthusiasm as we celebrate the inaugural match of the Women’s Premier League! #YehTohBasShuruatHai! @JayShah | @viacom18 | #WPL2023 | #WomensPremierLeague pic.twitter.com/S9frYBNbpI
— Women’s Premier League (WPL) (@wplt20) March 4, 2023
-
గుజరాత్, ముంబై మధ్య తొలి మ్యాచ్..
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య జరగనుంది. గుజరాత్ కమాండ్ ఆస్ట్రేలియా బెత్ మూనీ చేతిలో ఉండగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ ముంబైకి కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది.
-
ఆలస్యంగా ప్రారంభ వేడుకలు..
ఓపెనింగ్ సెర్మనీ ప్రారంభంలో జాప్యం జరగనుంది. దీని కారణంగా గుజరాత్ వర్సెస్ ముంబై మధ్య మొదటి మ్యాచ్ కూడా అరగంట ఆలస్యంగా ప్రారంభమవుతుంది. మ్యాచ్‌లో టాస్ రాత్రి 7.30 గంటలకు, ఇన్నింగ్స్ రాత్రి 8.00 గంటలకు ప్రారంభమవుతుంది.
??????????? ????? ??? #TATAWPL ??????? ???????
▶️Gates Open: 4 PM IST ▶️Opening Ceremony: 6:25 PM IST ▶️Match – Gujarat Giants vs Mumbai Indians ▶️Toss: 7:30 PM IST ▶️ Match Start: 8 PM IST
Details ?https://t.co/7i3bVgItJr
— Women’s Premier League (WPL) (@wplt20) March 4, 2023
Published On - Mar 04,2023 3:36 PM