Team India: ఈ ఫోటోలోని కుర్రాడిని గుర్తు పట్టారా? టీమిండియా రూపు రేఖలు మార్చేసిన లెజెండరీ క్రికెటర్

|

Jun 03, 2024 | 2:02 PM

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న కుర్రాడిని గుర్తు పట్టారా? అతను మొదట ఓ ఫుట్ బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. కానీ టికెట్ కలెక్టర్ గా మారాడు. ఆ తర్వాత క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. ఎలాగైనా టీమిండియాలో చోటు దక్కించుకోవాలనుకున్నాడు. తన కలలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు

Team India: ఈ ఫోటోలోని కుర్రాడిని గుర్తు పట్టారా? టీమిండియా రూపు రేఖలు మార్చేసిన లెజెండరీ క్రికెటర్
Team India Cricketer
Follow us on

పై ఫొటోలో అమాయకంగా కనిపిస్తోన్న కుర్రాడిని గుర్తు పట్టారా? అతను మొదట ఓ ఫుట్ బాల్ ప్లేయర్ కావాలనుకున్నాడు. కానీ టికెట్ కలెక్టర్ గా మారాడు. ఆ తర్వాత క్రికెట్ పై మక్కువ పెంచుకున్నాడు. ఎలాగైనా టీమిండియాలో చోటు దక్కించుకోవాలనుకున్నాడు. తన కలలను నిజం చేసుకోవడానికి చాలా కష్టపడ్డాడు. హార్డ్ వర్క్‌నే ఆయుధంగా నమ్ముకున్న అతని శ్రమకు తగిన ఫలితమే దక్కింది. టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట ప్లేయర్ గా.. ఆ తర్వాత కెప్టెన్ గా. ఇంకే ముంది.. తన ధనాధన్ బ్యాటింగ్ తో భారత్ కు మరపురాని విజయాలు అందించాడు. కెప్టెన్ గా ఏకంగా మూడు ఐసీసీ ప్రపంచకప్‌ లను టీమిండియాకు అందించాడు. ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్ ఈ కుర్రాడు మరెవరో కాదు అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా రూపు రేఖలు మార్చేసిన మహేంద్ర సింగ్ ధోని.

జీరో టు హీరో..

1981లో జులై 7వ తేదీన రాంచీలో జన్మించాడు ధోని. క్రికెట్ పై మక్కువతో టీమిండియాలోకి ఎంట్రీఇచ్చాడు. తొలి మ్యాచ్‌లోనే డక్ అవుట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత జీరో నుండి హీరో అయ్యాడు. తన ధనాధన్ బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించాడు. ఇక కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎన్నో టీమిండియాకు తిరుగులేని విజయాలను అందించాడు. 2007లో టీ 20 వరల్డ్ కప్, 2011లో వన్డే వరల్డ్ కప్.. 2013లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని మిస్టర్ కూల్ సారథ్యంలో వచ్చినవే. ధోని కెప్టెన్సీలో భారత జట్టు ఒక గోల్డ్ ఏరాగా మిగిలిపోయింది. 2019లో వన్డే, ఇటు టీ 20లకు గుడ్ బై చెప్పిన ధోనీ.. ప్రస్తుతం ఐపీఎల్‌లో మాత్రమే కొనసాగుతున్నాడు. అయితే వచ్చే సీజన్ లో ఆడతాడా? లేదా అంతకు ముందే ధనాధన్ లీగ్ కు కూడా రిటైర్మెంట్ ఇస్తాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.

ఇవి కూడా చదవండి

సీఎస్కే టీమ్ తో ధోని..

 

 

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..