Team India: పై ఫొటోలోని టీమిండియా క్రికెటర్‌ను గుర్తు పట్టారా? ఐసీసీ కప్పులు కొట్టడంలో మొనగాడు

|

Jul 07, 2024 | 8:27 AM

చిన్న కప్పుతో ఫొటోలకు పోజులిస్తోన్న ఈ కుర్రాడు ఆ తర్వాతి కాలంలో భారత క్రికెట్ జట్టుకు ఎన్నో ప్రతిష్ఠాత్మక ట్రోఫీలు సాధించి పెట్టాడు. కేవలం ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గానూ భారత జట్టుకు మరపురాని విజయాలు అందించాడు. ఈ క్రికెటర్ స్పెషాలిటీ ఎంటంటే.. ఎంత ఒత్తిడిలోనైనా కూల్ గా నిర్ణయాలు తీసుకోవడం..

Team India: పై ఫొటోలోని టీమిండియా క్రికెటర్‌ను గుర్తు పట్టారా? ఐసీసీ కప్పులు కొట్టడంలో మొనగాడు
Team India Cricketer Childhood Photo
Follow us on

పై ఫొటోలోని ఈ అబ్బాయిని గుర్తు పట్టారా? చిన్న కప్పుతో ఫొటోలకు పోజులిస్తోన్న ఈ కుర్రాడు ఆ తర్వాతి కాలంలో భారత క్రికెట్ జట్టుకు ఎన్నో ప్రతిష్ఠాత్మక ట్రోఫీలు సాధించి పెట్టాడు. కేవలం ఆటగాడిగానే కాకుండా కెప్టెన్ గానూ భారత జట్టుకు మరపురాని విజయాలు అందించాడు. ఈ క్రికెటర్ స్పెషాలిటీ ఎంటంటే.. ఎంత ఒత్తిడిలోనైనా కూల్ గా నిర్ణయాలు తీసుకోవడం.. అందుకే ప్రపంచ క్రికెట్ లో ఓ దిగ్గజంగా నిలిచిపోయాడీ క్రికెటర్. ముఖ్యంగా ఐసీసీ కప్పులు కొట్టడంలో ఈ ప్లేయర్ బాగా దిట్ట. తన సారథ్యంలో భారత్ కు ఏకంగా మూడు ఐసీసీ కప్పులు సాధించి పెట్టాడీ. ఇప్పటివరకు ఈ రికార్డును ఇంకా ఎవరూ అందుకోలేదు. భవిష్యత్ లో కూడా అందుకుంటారో? లేదో? చెప్పడం చాలా కష్టం. ఈ పాటికే అర్థమై ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో? యస్. ఈ పిల్లాడు మరెవరో కాదు మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని. ఆదివారం (జులై 07) మహీ బర్త్ డే. ఈ సందర్భంగా పలువురు క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు ఈ టీమిండియా దిగ్గజానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో ధోని చిన్ననాటి, అరుదైన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విషెస్ చెబుతున్నారు. పై ఫొటో కూడా అందులోదే.

తన కెరీర్ లో మొత్తం 200 వన్డేలు, 70 టెస్టులు, 72 టీ20లతో సహా మొత్తం 332 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ధోనీ నాయకత్వం వహించాడు. తన ధనాధన్ బ్యాటింగ్ తో బౌలర్లను రఫ్పాడించడమే కాకుండా మెరుపు క్యాచ్ లు, స్టంపింగ్స్ తో ఎంతో మందిని పెవిలియన్ కు పంపించాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న ఏకైక టీమిండియా కెప్టెన్‌గా మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు నెలకొల్పాడు .

ఇవి కూడా చదవండి

భారత్‌కు తొలి టీ20 ప్రపంచకప్ (2007), రెండో వన్డే ప్రపంచకప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) సాధించి పెట్టాడు మిస్టర్ కూల్. అంతర్జాతీయ క్రికెట్ కు ఎప్పుడో గుడ్ బై చెప్పేసిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..