IND Vs NZ: కివీస్‌తో తొలి వన్డే.! గంభీర్ కన్నింగ్ ప్లాన్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆ ముగ్గురు కన్ఫర్మ్

దక్షిణాఫ్రికాతో సిరీస్ అయింది. ఇప్పుడు మరో సిరీస్ మొదలుకానుంది. రేపటి నుంచి అనగా జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కానుంది. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ బరిలోకి దిగనున్నారు. మరి తొలి వన్డే ఎప్పుడు.? ఎక్కడ.? జరుగుతుందంటే.? ఆ వివరాలు..

IND Vs NZ: కివీస్‌తో తొలి వన్డే.! గంభీర్ కన్నింగ్ ప్లాన్.. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆ ముగ్గురు కన్ఫర్మ్
Ind Vs Nz

Updated on: Jan 10, 2026 | 11:50 AM

కొత్త సంవత్సరం.. మరో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఆతిధ్య జట్టు టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ తలబడనుంది. తొలి వన్డే ఆదివారం వడోదర క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు తెలుసుకుందామా.. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ ఆడటం కన్ఫర్మ్. ఓపెనింగ్ రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ దిగనుండగా.. వన్ డౌన్ విరాట్ కోహ్లీ కన్ఫర్మ్. ఇక నాలుగో స్థానంలో.. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో అర్ధ సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్ కంబ్యాక్ ఇవ్వనున్నాడు.

ఇది చదవండి: ‘నారా లోకేష్, ఆ హీరో, నేను క్లాస్‌మేట్స్.. కాలేజీ రోజుల్లో మేమంతా..’

వికెట్ కీపర్‌గా కెఎల్ రాహుల్ స్టంప్స్ చూసుకోనున్నాడు. ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదో స్థానంలో బ్యాటింగ్ చేయనున్నాడు. దీంతో రిషబ్ పంత్ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆరో స్థానంలో బ్యాటింగ్ దిగుతాడు. ఏడో స్థానంలో వాషింగ్టన్ సుందర్ లేదా నితీష్ కుమార్ రెడ్డి బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. సుందర్ ప్రస్తుత ఫామ్‌ను చూస్తే.. అతడికే ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కేలా ఉంది. ఇక గంభీర్ శిష్యుడు హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ఫాస్ట్ బౌలింగ్ విభాగాన్ని చూసుకోనున్నారు. స్పిన్ విషయానికొస్తే.. కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ చూసుకుంటారు.

ఇవి కూడా చదవండి

భారత్ ప్లేయింగ్ ఎలెవన్ ఇలా..

శుభ్‌మాన్ గిల్(కెప్టెన్), శ్రేయాస్ అయ్యర్(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్

బెంచ్: యశస్వి జైస్వాల్, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్

ఇది చదవండి: ఆ సినిమానే చిరంజీవిని ఫ్లాప్‌ల నుంచి గట్టెక్కించింది.. ఓపెన్‌గా చెప్పేసిన టాలీవుడ్ దర్శకుడు

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..