AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Test Captain: గిల్ వద్దు ఆ బుల్లెట్టే ముద్దు! రోహిత్ వారసుడిని ఎంచుకున్న 83 వరల్డ్ కప్ విన్నర్!

రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో, తదుపరి కెప్టెన్ ఎంపికపై చర్చలు ఊపందుకున్నాయి. 1983 వరల్డ్ కప్ విజేత మదన్ లాల్, గిల్ కాకుండా బుమ్రా నాయకత్వానికి అనుకూలమని తెలిపారు. అయితే, బుమ్రా గాయాల సమస్య కారణంగా BCCI పూర్తి బాధ్యతలు ఇవ్వడం కుదరదని అంచనా. గిల్ స్టైలిష్ ఆట, స్థిరతతో తనను నిరూపించుకున్న నేపథ్యంలో, కెప్టెన్సీ కోసం పోటీ ఆసక్తికరంగా మారింది.

New Test Captain: గిల్ వద్దు ఆ బుల్లెట్టే ముద్దు! రోహిత్ వారసుడిని ఎంచుకున్న 83 వరల్డ్ కప్ విన్నర్!
Gill Rohit
Narsimha
|

Updated on: May 08, 2025 | 7:00 PM

Share

భారత టెస్ట్ క్రికెట్‌లో నాయకత్వ మార్పులకు సంబంధించి ఈ మధ్యకాలంలో సంచలనాత్మక పరిణామాలు చోటు చేసుకున్నాయి. బుధవారం సాయంత్రం భారత కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు తన రిటైర్మెంట్‌ను ప్రకటించడం ద్వారా క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశారు. ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రోహిత్ తన అధికారిక సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ నేపథ్యంలో, తదుపరి భారత టెస్ట్ కెప్టెన్ ఎవరు అనే చర్చ జోరుగా నడుస్తోంది. అందులో భాగంగా 1983 వరల్డ్ కప్ విజేత జట్టు సభ్యుడు, మాజీ ఫాస్ట్ బౌలర్ మదన్ లాల్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, యువ క్రికెటర్ శుభ్‌మాన్ గిల్ కాకుండా జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వ బాధ్యతలు చేపట్టడం సరైనదని అభిప్రాయపడ్డారు. బుమ్రా నిత్యం జట్టులో ఉంటూ నిరంతర ప్రదర్శన ఇస్తున్నాడని, అతను ఇప్పటి వరకు చూపిన పట్టు, అనుభవం భారత టెస్ట్ జట్టుకు ఉపయోగపడుతుందని మదన్ లాల్ వ్యాఖ్యానించారు.

గతంలో, రోహిత్ శర్మ గైర్హాజరైన సమయంలో పెర్త్ వేదికగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో బుమ్రా నాయకత్వం వహించగా, భారత జట్టు ఆస్ట్రేలియాను వారి సొంత మైదానంలో ఓడించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. బుమ్రా తన శాంతమైన స్వభావంతో, దూకుడు ప్రదర్శనతో జట్టును సమర్థంగా నడిపించగలడని భావిస్తున్నారు. అయితే, ఇదే సమయంలో బీసీసీఐ వర్గాలు బుమ్రాపై ఉన్న గాయాల భయంతో అతనికి పూర్తిస్థాయి కెప్టెన్సీ ఇవ్వడం కుదరదని కూడా చర్చ జరుగుతోంది. ఇటీవల అతను వెన్ను గాయంతో బాధపడుతూ కొన్ని ముఖ్యమైన టోర్నీలకు దూరంగా ఉన్న విషయం కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

దీంతో, సెలెక్షన్ కమిటీ ముందు ప్రస్తుతం ఉన్న ప్రధాన రెండు ఎంపికలు గిల్, బుమ్రా. యువ ఆటగాళ్లలో శుభ్‌మాన్ గిల్ స్టైలిష్ బ్యాటింగ్‌తో పాటు స్థిరతను ప్రదర్శిస్తున్నాడు. అతను రోహిత్ శర్మ తర్వాత తరంలో నాయకత్వ భారం తీసుకునే స్థాయికి ఎదిగాడని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బుమ్రాపై ఫిజికల్ భారం తగ్గించేందుకు BCCI అడిషనల్ బాధ్యతలు ఇవ్వకుండా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో, గిల్‌ను టెస్ట్ కెప్టెన్‌గా నియమించవచ్చనే ఊహాగానాలు బలపడుతున్నాయి. రాబోయే రోజుల్లో బీసీసీఐ ఈ కీలక నిర్ణయం ఎలా తీసుకుంటుందనేది క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..