
Dhoni as a Team India Coach: భారత్ ప్రపంచకప్ గెలిచిన శుభసందర్భంగా ధోనీ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. “గౌతమ్ సాబ్, నీ ముఖంపై చిరునవ్వు చాలా బాగుంటుంది. ఆ గంభీరమైన ముఖం, ఈ నవ్వు.. అబ్బా అది ఒక కిల్లర్ కాంబో!” అంటూ ప్రశంసించాడు. దీనిపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన గంభీర్.. ధోనీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫైనల్ చూడటానికి ధోనీ రావడం సంతోషమని, తన నవ్వు గురించి ధోనీ అలా అనడం నచ్చిందని పేర్కొన్నాడు.
అంతేకాకుండా, గంభీర్ ఒక అడుగు ముందుకు వేసి.. “ఏదో ఒక రోజు ధోనీ నా స్థానంలో (హెడ్ కోచ్‌గా) ఉండాలని కోరుకుంటున్నాను. అప్పుడు నేను కూడా ధోనీ గురించి అదే కోట్ రాస్తాను. అతను డగౌట్‌లో కూర్చుని నవ్వుతుంటే చూడాలని ఉంది” అని తన మనసులో మాట బయటపెట్టాడు. ధోనీ టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టి, కోచ్ హోదాలో కూడా ఐసీసీ ట్రోఫీ గెలవాలని గంభీర్ ఆకాంక్షించడం గమనార్హం.
2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్ విజయాల్లో ధోనీ కెప్టెన్‌గా ఉంటే, గంభీర్ కీలక ఆటగాడిగా ఉన్నాడు. ఇప్పుడు గంభీర్ కోచ్‌గా ఉండగా టీమ్ ఇండియా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, 2026 టీ20 వరల్డ్ కప్‌లను గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా రెండోసారి, సొంత గడ్డపై తొలిసారి టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుగా భారత్ ప్రపంచ రికార్డు సాధించింది. ఒకవేళ ధోనీ కోచ్‌గా బాధ్యతలు చేపడితే భారత క్రికెట్ మరో స్థాయికి వెళ్తుందని అభిమానులు భావిస్తున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..