AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇదేందయ్యా గంభీర్.. ఆ ప్లేయర్‌పై అంత పంతమా.. ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా బెంచ్‌కే ఫిక్స్ చేస్తావా?

Gambhir vs Iyer: టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అంతర్గత విభేదాలపై చర్చ జరుగుతోంది. తాజాగా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఎంపిక వివాదాస్పదమైంది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్‌కు బదులు అర్షదీప్ సింగ్‌ను తీసుకోవడంపై నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్రపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీసీసీఐ మౌనంపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ఇదేందయ్యా గంభీర్.. ఆ ప్లేయర్‌పై అంత పంతమా.. ఒక్క ఛాన్స్ ఇవ్వకుండా బెంచ్‌కే ఫిక్స్ చేస్తావా?
Gautam Gambhir
Venkata Chari
|

Updated on: Jan 31, 2026 | 6:55 AM

Share

Gambhir vs Iyer: టీమ్ ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి జట్టులో అంతర్గత విభేదాలు ఉన్నాయని క్రీడా వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వార్తలతో భారత క్రికెట్ అభిమానులను కలవరపరుస్తున్నాయి. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్లతో గంభీర్‌కు ఉన్న సంబంధాల గురించి చర్చ జరిగినప్పటికీ, ప్రస్తుతం బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌తో కోచ్‌కు పొసగడం లేదనే వార్తలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వివాదం ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆటగాళ్ల ఎంపికతో మరింత రాజుకుంది.

సాధారణంగా స్పెషలిస్ట్ బ్యాటర్ అయిన శ్రేయస్ అయ్యర్‌ను తుది జట్టులో తీసుకోవాల్సి ఉండగా, అనూహ్యంగా బౌలర్ అర్షదీప్ సింగ్‌ను ఎంపిక చేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. ఇషాన్ కిషన్ స్థానంలో అయ్యర్‌ను తీసుకోకుండా అర్షదీప్‌కు అవకాశం ఇవ్వడంపై నెటిజన్లు, క్రికెట్ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. గంభీర్ శ్రేయస్ అయ్యర్ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నాడని, అందుకే అతడికి తగినన్ని అవకాశాలు లభించడం లేదని సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ పరిణామం ఆటగాళ్ల ఎంపికలో వ్యక్తిగత ఇష్టాఇష్టాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయనే వాదనలకు బలం చేకూరుస్తోంది. గంభీర్ రాకతో జట్టులో క్రమశిక్షణ పెరిగినప్పటికీ, ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియలో పారదర్శకత లోపించిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఈ మొత్తం వ్యవహారంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాత్రపై కూడా గట్టి చర్చ నడుస్తోంది. జట్టు ఎంపికలో సూర్యకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అధికారం ఉందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు సూర్య కేవలం టాస్ వేయడానికి మాత్రమే పరిమితమైన కెప్టెన్ ఆ? అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు. భారత క్రికెట్ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా జట్టు నియంత్రణ అంతా పూర్తిగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ చేతుల్లోనే ఉందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

జట్టు వ్యూహాల రూపకల్పన నుండి ఆటగాళ్ల మార్పుల వరకు ప్రతి నిర్ణయం గంభీర్ కనుసన్నల్లోనే జరుగుతోందని, కెప్టెన్ పాత్ర నామమాత్రంగా మారిందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిస్థితి టీమ్ ఇండియాలో ఒక కొత్త అధికార కేంద్రాన్ని సృష్టించిందని, ఇది దీర్ఘకాలంలో జట్టు ఐక్యత, ప్రదర్శనపై ప్రతికూల ప్రభావం చూపవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, భవిష్యత్తులో కీలక టోర్నమెంట్లు రానున్న తరుణంలో ఇలాంటి అంతర్గత సమస్యలు జట్టును బలహీనపరుస్తాయని అభిప్రాయపడుతున్నారు.

అయితే, ఈ తీవ్రమైన ఆరోపణలపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గానీ, టీమ్ మేనేజ్‌మెంట్ గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఈ మౌనం అభిమానుల్లో మరింత గందరగోళాన్ని, ఆందోళనను పెంచుతోంది. ఈ అనిశ్చితి టీమ్ ఇండియా ఐక్యతపై ప్రభావం చూపే అవకాశం ఉందని, ఆటగాళ్ల మనోస్థైర్యాన్ని దెబ్బతీస్తుందని క్రికెట్ అభిమానులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జట్టులో సమిష్టి భావం కొరవడితే, అది మైదానంలో ఆటతీరుపై తప్పకుండా ప్రభావం చూపుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు భారత క్రికెట్‌కు దీర్ఘకాలంలో హానికరంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇదేందయ్యా గంభీర్.. ఆ ప్లేయర్‌పై అంత పంతమా..
ఇదేందయ్యా గంభీర్.. ఆ ప్లేయర్‌పై అంత పంతమా..
ఎంత తిన్నా బరువు పెరగడం లేదా.. ఈ సూపర్ ఫుడ్ తింటే 30 రోజుల్లోనే..
ఎంత తిన్నా బరువు పెరగడం లేదా.. ఈ సూపర్ ఫుడ్ తింటే 30 రోజుల్లోనే..
ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని బ్రదర్స్.. అఖిల్‌ అకౌంట్‌లో బిగ్ హిట్‌
ఒకే ఫ్రేమ్‌లో అక్కినేని బ్రదర్స్.. అఖిల్‌ అకౌంట్‌లో బిగ్ హిట్‌
భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత ?
భారీ పతనం.. ఒక్క రోజే రూ.85 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత ?
సింగిల్‌గా వర్క్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు తోడుగా మినీ మోచి
సింగిల్‌గా వర్క్ చేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు తోడుగా మినీ మోచి
ఆడియన్స్‌ డబ్బు ఖర్చు చేసేది అందుకే.. ఇబ్బంది పెట్టొదంటున్న విజయ్
ఆడియన్స్‌ డబ్బు ఖర్చు చేసేది అందుకే.. ఇబ్బంది పెట్టొదంటున్న విజయ్
2027 సంక్రాంతికి వెంకీతో మరో మల్టీస్టారర్ రెడీ చేస్తున్న అనిల్..
2027 సంక్రాంతికి వెంకీతో మరో మల్టీస్టారర్ రెడీ చేస్తున్న అనిల్..
చిరు టు బన్నీ.. పాన్‌ ఇండియా ట్రెండ్‌తో మారిన రెమ్యునరేషన్లు
చిరు టు బన్నీ.. పాన్‌ ఇండియా ట్రెండ్‌తో మారిన రెమ్యునరేషన్లు
రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్‌? 300 వందే భారత్‌ రైళ్లు..?
రూ.13 లక్షల వరకు నో ట్యాక్స్‌? 300 వందే భారత్‌ రైళ్లు..?
ట్రోఫీ గెలవాలంటే ఆ విషయంలో బీకేర్ ఫుల్..: రోహిత్ శర్మ
ట్రోఫీ గెలవాలంటే ఆ విషయంలో బీకేర్ ఫుల్..: రోహిత్ శర్మ