AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kuldeep Yadav: కుల్దీప్ భవిష్యత్తుపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు ప్రాబ్లం అక్కడే ఉందా?

Kuldeep Yadav: టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ భవిష్యత్తుపై గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వికెట్ల కోసం తొందరపడకుండా లైన్ అండ్ లెంగ్త్‌తో సుదీర్ఘంగా బౌలింగ్ చేయాలని సూచించారు. తుది జట్టులో స్థానం కోసం అత్యుత్తమ బౌలింగ్ కాంబినేషన్‌కే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నిర్ణయమే కీలకమని తెలిపారు.

Kuldeep Yadav: కుల్దీప్ భవిష్యత్తుపై గంభీర్ సంచలన వ్యాఖ్యలు.. అసలు ప్రాబ్లం అక్కడే ఉందా?
Kuldeep Yadav
Rakesh
|

Updated on: Aug 23, 2026 | 8:34 AM

Share

Kuldeep Yadav: టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్రస్తుత ఫామ్, జట్టులో అతని పాత్రపై హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మైదానంలో వికెట్ల కోసం కంగారు పడకుండా, సరైన ప్రణాళికతో సుదీర్ఘ స్పెల్స్ వేయడంపై మాత్రమే దృష్టి పెట్టాలని కుల్దీప్‌కు స్పష్టమైన సూచనలు ఇచ్చారు. గత కొంతకాలంగా టీమిండియా తుది జట్టులో కుల్దీప్ యాదవ్‌కు సరైన అవకాశాలు లభించడం లేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ పర్యటనల్లో పది టెస్టులు జరిగినా అతనికి ఒక్క మ్యాచ్‌లోనూ అవకాశం దక్కలేదు. ఆస్ట్రేలియా పిచ్‌లు పేసర్లకు అనుకూలించినా, ఇంగ్లాండ్‌లో పాత బంతితో స్పిన్ తిప్పే బౌలర్ లేకపోవడం జట్టును బాగా దెబ్బతీసింది. వన్డే సిరీస్‌లోనూ మధ్య ఓవర్లలో వికెట్లు తీసే ప్రత్యామ్నాయం అవసరమైనప్పటికీ, మేనేజ్‌మెంట్ అతడిని పక్కనబెట్టడమే పెద్ద చర్చనీయాంశంగా మారింది.

స్వదేశంలో జరిగిన మ్యాచ్‌ల్లో కుల్దీప్ వరుసగా అవకాశాలు పొందినప్పటికీ, ప్రత్యర్థి బ్యాటర్లను భయపెట్టలేకపోయారు. ముఖ్యంగా దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో బంతిని అనుకున్న స్థాయిలో టర్న్ చేయడంలో విఫలమయ్యారు. శ్రీలంకతో గాల్లో జరిగిన మొదటి టెస్టులో 25 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం ఒకే ఒక్క వికెట్ పడగొట్టారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ చూపుతున్న ఆప్షన్లలో కుల్దీప్ మూడో స్పిన్నర్‌గా మారిపోయారు. సరైన మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం వల్లే అతడు ఫామ్ కోల్పోతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇది కూడా చదవండి: Ravindra Jadeja: కొలంబో వేదికగా జడేజా చారిత్రాత్మక రికార్డు.. తొలి భారతీయ క్రికెటర్‌గా అరుదైన ఘనత

ఈ పరిస్థితులపై స్పందించిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కుల్దీప్ క్వాలిటీ బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. మ్యాచ్ పరిస్థితులను బట్టి ఏ బౌలర్‌ను ఎంతవరకు ఉపయోగించుకోవాలో కెప్టెన్ నిర్ణయిస్తారని చెప్పారు. ఐదుగురు ప్రైమ్ బౌలర్లతో బరిలోకి దిగినప్పుడు ఎవరో ఒకరికి తక్కువ ఓవర్లు రావడం సహజమని స్పష్టం చేశారు. వికెట్లు తీయాలనే తొందరపాటులో కంట్రోల్ కోల్పోవద్దని, మంచి లెంగ్త్‌లో సుదీర్ఘంగా బౌలింగ్ చేయడమే ముఖ్యమని కుల్దీప్‌కు సూచించినట్లు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: UP T20 League 2026: 46 బంతుల్లోనే విధ్వంసం.. కేవలం సిక్సర్లు, ఫోర్లతోనే 96 రన్స్.. హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఇన్నింగ్స్

రైట్ అండ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ కాంబినేషన్‌ను ఎదుర్కొనేందుకు జట్టులో సారాంశ జైన్ రూపంలో మరొక ఆల్‌రౌండర్ అందుబాటులో ఉన్నారని గంభీర్ గుర్తుచేశారు. శ్రీలంక జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య పెరగడంతో, మేనేజ్‌మెంట్ వ్యూహాత్మక మార్పులు చేస్తోంది. పేరు లేదా వికెట్ల సంఖ్య ఆధారంగా కాకుండా, ప్రత్యర్థి 20 వికెట్లు పడగొట్టగల అత్యుత్తమ బౌలింగ్ కాంబినేషన్‌ను మాత్రమే మైదానంలోకి దింపుతామని గంభీర్ తేల్చిచెప్పారు. కుల్దీప్ యాదవ్ క్లాస్ బౌలర్ అనడంలో సందేహం లేదు, కానీ తుది జట్టులో స్థానం దక్కాలంటే కోచ్ సూచించినట్లు కంట్రోల్, లైన్ అండ్ లెంగ్త్‌పై మరింత శ్రద్ధ పెట్టాల్సి ఉంది. రాబోయే మ్యాచుల్లో టీమిండియా మేనేజ్‌మెంట్ ఎలాంటి కాంబినేషన్‌తో వెళ్తుందో చూడాలి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us