AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP T20 League 2026: 46 బంతుల్లోనే విధ్వంసం.. కేవలం సిక్సర్లు, ఫోర్లతోనే 96 రన్స్.. హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఇన్నింగ్స్

UP T20 League 2026: యూపీ టీ20 లీగ్ 2026లో స్వాస్తిక్ చికారా విధ్వంసం సృష్టించారు. కాన్పూర్ సూపర్‌స్టార్స్‌పై కేవలం 46 బంతుల్లో 97 పరుగులతో నాటౌట్‌గా నిలిచి మీరట్ మావెరిక్స్‌కు ఘన విజయాన్ని అందించారు. 7 సిక్సర్లు, 9 ఫోర్లతో 96 పరుగులు బౌండరీల ద్వారానే సాధించారు. కర్ణ్ శర్మ 92 పరుగుల రికార్డును అధిగమించి సీజన్‌లోనే అత్యధిక స్కోరుగా చరిత్ర సృష్టించారు.

UP T20 League 2026: 46 బంతుల్లోనే విధ్వంసం.. కేవలం సిక్సర్లు, ఫోర్లతోనే 96 రన్స్.. హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఇన్నింగ్స్
Swastik Chikara
Rakesh
|

Updated on: Aug 23, 2026 | 8:07 AM

Share

UP T20 League 2026: యూపీ టీ20 లీగ్ 2026 సీజన్‌లో మీరట్ మావెరిక్స్ ఓపెనర్ స్వాస్తిక్ చికారా కనీవినీ ఎరుగని విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. ఆగస్టు 22 సాయంత్రం కాన్పూర్ సూపర్‌స్టార్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 46 బంతుల్లోనే 97 రన్స్ బాది, తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించారు. మైదానంలోకి దిగిన క్షణం నుంచి కాన్పూర్ బౌలర్లపై స్వాస్తిక్ చికారా దండయాత్ర ప్రారంభించారు. 143 రన్స్ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మీరట్ మావెరిక్స్‌కు ఓపెనర్ రూపంలో కొండంత కొండ లభించింది. ఏ దశలోనూ తగ్గకుండా 210.87 స్ట్రైక్ రేట్‌తో బౌండరీల వర్షం కురిపించారు. మ్యాచ్ ఆఖరి వరకు నాటౌట్‌గా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. అతడి ఇన్నింగ్స్‌లో ఏకంగా 7 భారీ సిక్సర్లు, 9 ఫోర్లు ఉన్నాయి. అంటే బాదిన 97 రన్స్‌లో 96 రన్స్ కేవలం బౌండరీల ద్వారానే రావడం విశేషం.

ఈ అద్భుత విజయానికి పునాది మాత్రం మీరట్ మావెరిక్స్ కెప్టెన్ రింకూ సింగ్ వేశాడు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన కాన్పూర్ సూపర్‌స్టార్స్ జట్టును కట్టడి చేసేందుకు రింకూ తన బౌలింగ్ అస్త్రాన్ని ప్రయోగించారు. క్రీజులో పాతుకుపోయి ప్రమాదకరంగా మారుతున్న కాన్పూర్ ఓపెనర్ ఆదర్శ్ సింగ్ (45)ను రింకూ పెవిలియన్ దారి పట్టించారు. ఆ ఒక్క వికెట్ మ్యాచ్ గమనాన్ని పూర్తిగా మార్చేసింది. ఫలితంగా కాన్పూర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 142 రన్స్‌కే పరిమితమైంది.

 ఇది కూడా చదవండి: Love Affairs: ఆటగాడు మామూలు ఆటగాడు కాదు.. పాక్ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్‌తో బాలీవుడ్ భామల అఫైర్లు

సీజన్‌లోనే ఆల్ టైమ్ రికార్డు

యూపీ టీ20 లీగ్ ప్రస్తుత సీజన్ చరిత్రలోనే ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా స్వాస్తిక్ కొత్త చరిత్ర సృష్టించారు. అంతకుముందు కర్ణ్ శర్మ పేరిట ఉన్న 92 రన్స్ రికార్డును ఇతడు అధిగమించారు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచుల్లో మొత్తం 193 రన్స్ సాధించిన స్వాస్తిక్, మోస్ట్ డేంజరస్ బ్యాటర్‌గా అవతరించారు. ఇప్పటివరకు 32 బౌండరీలు (11 సిక్సర్లు, 21 ఫోర్లు) బాది టోర్నీలోనే టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నారు.

ఇది కూడా చదవండి: Mitchell Starc: వీడు మగాడ్రా బుజ్జి.. 42 నిమిషాల్లో 22 బంతులు వేసి 5 వికెట్లు.. ఇది ఆల్ టైమ్ రికార్డ్

కాన్పూర్ ఆశలపై నీళ్లు చల్లిన మీరట్

కాన్పూర్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా స్వాస్తిక్ ఉగ్రరూపాన్ని అడ్డుకోలేకపోయారు. కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయడానికి ప్రయత్నించిన ప్రతిసారీ, బంతిని సరిహద్దు దాటించడమే లక్ష్యంగా ఇతడు విరుచుకుపడ్డారు. సహచర బ్యాటర్లు కేవలం సహకారం అందిస్తుండగా, ఒక్కడే మ్యాచ్‌ను ఏకపక్షం చేసేశారు. మీరట్ మావెరిక్స్ సాధించిన ఈ వరుస విజయంతో పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. రింకూ సింగ్ బౌలింగ్ మెరుపు, స్వాస్తిక్ చికారా బ్యాటింగ్ విధ్వంసంతో మీరట్ మావెరిక్స్ లీగ్‌లో తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది. రాబోయే మ్యాచుల్లో కూడా స్వాస్తిక్ ఇదే ఫామ్ కొనసాగిస్తే మీరట్‌ను అడ్డుకోవడం ఏ జట్టుకూ సాధ్యం కాకపోవచ్చు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us