Team India: టీమిండియాలో శర్మ ప్లేయింగ్ 11.. ఒకరిని మించి మరొకరు.. ఈ డైనమేట్లను చూస్తే బౌలర్లకు వణుకే

Sharma Surname of Team India: భారత క్రికెట్‌లో 'శర్మ' అనే ఇంటిపేరుతో ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్ళు తమ ప్రతిభను చాటుకున్నారు. అభిషేక్ శర్మ నుంచి రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ వంటి ప్రముఖ ఆటగాళ్ళ గురించే కాదండోయ్.. యశ్‌పాల్ శర్మ, చేతన్ శర్మ వంటి మాజీ క్రికెటర్ల వరకు.. శర్మ ప్లేయింగ్ 11 గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Team India: టీమిండియాలో శర్మ ప్లేయింగ్ 11.. ఒకరిని మించి మరొకరు.. ఈ డైనమేట్లను చూస్తే బౌలర్లకు వణుకే
Team India

Updated on: Feb 03, 2025 | 8:31 PM

Sharma Surname of Team India: టీమిండియా యువ ఓపెనర్‌ బ్యాట్స్‌మెన్‌ అభిషేక్‌ శర్మ ప్రపంచ క్రికెట్‌లో మరోసారి తానేంటో నిరూపించుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో అభిషేక్ శర్మ పేరు మారుమోగిపోయింది. అభిషేక్ కంటే ముందు ఇదే ఇంటిపేరుతో పలువురు ఆటగాళ్లు భారత క్రికెట్‌లో సందడి చేశారు. వారిలో కొందరు ఇప్పటికీ ఆడుతున్నారు. చాలా మంది మాజీ ఆటగాళ్లు ఉన్నారు. కాబట్టి, ఈరోజు ‘శర్మ ప్లేయింగ్ ఎలెవెన్’ని ఇప్పుడు తెలుసుకుందాం.

1.అభిషేక్ శర్మ..

ముందుగా అభిషేక్ శర్మ పేరు తీసుకుందాం. ఫిబ్రవరి 2న ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టీ20లో 54 బంతుల్లో 135 పరుగులు చేయడం ద్వారా అంతర్జాతీయ టీ20లో రెండో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ 17 టీ20 మ్యాచ్‌ల్లో 535 పరుగులు చేశాడు. అతని బ్యాట్‌లో 41 సిక్సర్లు, 46 ఫోర్లు వచ్చాయి.

2. రోహిత్ శర్మ..

టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు ఎలాంటి ప్రత్యేక గుర్తింపు అవసరం లేదు. 2024లోనే తన కెప్టెన్సీలో టీ-20 ప్రపంచకప్‌ను టీమ్‌ఇండియా గెలుచుకునేలా చేశాడు. ఇప్పటి వరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 19 వేలకు పైగా పరుగులు చేసిన రోహిత్ తన బ్యాట్‌తో 48 సెంచరీలు సాధించాడు.

ఇవి కూడా చదవండి

3. ఇషాంత్ శర్మ..

ఇషాంత్ శర్మ భారత్ తరపున 100కు పైగా టెస్టులు ఆడిన బౌలర్. 105 టెస్టుల్లో 311 వికెట్లు తీశాడు. ఇది కాకుండా ఇషాంత్ 80 వన్డేల్లో 115 వికెట్లు తీశాడు. ఇషాంత్ టీ20లో 14 మ్యాచ్‌లు ఆడి 8 వికెట్లు తీశాడు.

4. యశ్పాల్ శర్మ..

1983లో భారత్ తొలి ప్రపంచకప్‌ను గెలుచుకున్న సమయంలో యశ్‌పాల్ శర్మ కూడా పాత్ర పోషించాడు. యశ్‌పాల్ భారత్ తరపున 37 టెస్టులు, 42 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. యశ్పాల్ ఈ లోకంలో లేడు. అతను జులై 2021 లో మరణించాడు.

5. చేతన్ శర్మ..

యశ్‌పాల్ శర్మ మేనల్లుడు చేతన్ శర్మ కూడా భారత్ తరపున క్రికెట్ ఆడాడు. ప్రపంచకప్‌లో హ్యాట్రిక్‌ సాధించిన తొలి బౌలర్‌ చేతన్‌. ఈ బౌలర్ భారత్ తరపున 23 టెస్టులు, 65 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి 128 వికెట్లు తీశాడు.

6. మోహిత్ శర్మ..

భారత్ తరపున ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ 26 వన్డేల్లో 31 వికెట్లు, 8 టీ20ల్లో 6 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో అతని రికార్డు అద్భుతంగా ఉంది. మోహిత్ 112 మ్యాచుల్లో 132 వికెట్లు తీశాడు.

7. కరణ్ శర్మ..

స్పిన్నర్ కరణ్ శర్మ భారత్ తరపున 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడి ఐదు వికెట్లు పడగొట్టాడు. అయితే, ఐపీఎల్‌లో అతని రికార్డు అద్భుతంగా ఉంది. ఈ లీగ్‌లో 82 మ్యాచ్‌ల్లో 76 వికెట్లు తీశాడు.

8. జోగిందర్ శర్మ..

జోగిందర్ శర్మ పేరును భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. ఇప్పుడు పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న జోగీందర్ 2007 టీ-20 ప్రపంచ కప్‌ను భారత్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. చివరి మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అయినప్పటికీ, అతను పెద్ద క్రికెటర్ కాలేకపోయాడు. అతని అంతర్జాతీయ కెరీర్ కేవలం 8 మ్యాచ్‌లకే పరిమితమైంది.

9. అజయ్ శర్మ..

అజయ్ శర్మ 31 వన్డేల్లో 424 పరుగులు, ఒక టెస్టులో 53 పరుగులు చేశాడు. కానీ, ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో, అతను 129 మ్యాచ్‌లలో 67.46 అద్భుతమైన సగటుతో 10,120 పరుగులు చేశాడు.

10. గోపాల్ శర్మ..

64 ఏళ్ల గోపాల్ శర్మ భారత్ తరపున 11 టెస్టులు, 5 వన్డేలు ఆడాడు. రెండు ఫార్మాట్లలో కలిపి పది వికెట్లు తీశాడు. ఇది కాకుండా, అతను టీమిండియా జాతీయ సెలక్షన్ కమిటీలో కూడా సభ్యుడిగా ఉన్నాడు.

11. సంజీవ్ శర్మ..

59 ఏళ్ల సంజీవ్ శర్మ 2 టెస్టు మ్యాచ్‌ల్లో 6 వికెట్లు తీశాడు. ఇది కాకుండా 23 వన్డేల్లో 22 వికెట్లు తీశాడు. వన్డేల్లో అతని అత్యుత్తమ ప్రదర్శన 26 పరుగులకు 5 వికెట్లు తీయడం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..