చదువుల్లో పూర్.. సంపదలో ఫుల్ రిచ్.. ఈ టీమిండియా ఆటగాళ్ల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే మైండ్ బ్లాంకే
టీం ఇండియాలోని చాలా మంది ఆటగాళ్లు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. వాళ్లకు కోట్ల రూపాయల సంపదకు యజమానులుగా ఉన్నారు. అయితే, చదువుల విషయానికి వస్తే, చాలా మంది భారత క్రికెటర్లు ఈ విషయంలో వెనుకబడి ఉన్నారు. భారత జట్టులోని కొంతమంది ఆటగాళ్ల చదువులు, ఆస్తుల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిల్లల తల్లిదండ్రులకు ఎన్నో సలహాలు, సూచనలు ఇచ్చారు. తల్లిదండ్రులు తమ కోరికలను పిల్లలపై రుద్దకూడదని ప్రధానమంత్రి అన్నారు. పిల్లలు అన్ని రంగాలలోనూ రాణించాలనే అత్యాశ వద్దు. ప్రతి బిడ్డ వివిధ రంగాలలో ఆసక్తిని కలిగి ఉంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్‌ను ఉదాహరణగా చూపిస్తూ, సచిన్ టెండూల్కర్ క్రీడల్లో అద్బుతమైనవాడు. కానీ, చదువులో మాత్రం అలాకాదంటూ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలో భారతదేశంలోని కొంతమంది చురుకైన క్రికెటర్ల గురించి తెలుసుకుందాం. వాళ్ల చదువులు, సంపద అన్ని వివరాలు తెలుసుకుందాం.
1. శుభ్‌మాన్ గిల్..
శుభ్‌మాన్ గిల్ భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్. గిల్ మొహాలీలోని మానవ్ మంగళ్ స్మార్ట్ స్కూల్ నుంచి మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు. అయితే, అతను కళాశాల విద్యను కొనసాగించలేకపోయాడు. నేడు గిల్‌కు రూ.32 నుంచి 34 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి.
2. హర్షిత్ రాణా..
ఫాస్ట్ బౌలర్ హర్షిత్ రాణా ఇటీవలే టీమిండియా తరపున మూడు ఫార్మాట్లలోనూ అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో కేకేఆర్ తరపున ఆడే హర్షిత్ రాణా నికర విలువ దాదాపు రూ.5 కోట్లుగా ఉంది.
3. విరాట్ కోహ్లీ..
ప్రపంచం మొత్తం ‘కింగ్’ గా ప్రసిద్ధి చెందిన విరాట్ కోహ్లీ 12వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. కానీ అతను భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతులైన క్రికెటర్లలో ఒకడిగా మారాడు. కోహ్లీ మొత్తం నికర విలువ రూ.1050 కోట్లుగా ఉంది.
4. రోహిత్ శర్మ..
భారత కెప్టెన్ రోహిత్ శర్మ కళాశాల చదువుల కోసం రిజ్వీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ అండ్ కామర్స్‌లో అడ్మిషన్ తీసుకున్నాడు. కానీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేకపోయాడు. అతను క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. నేడు అతను దిగ్గజ క్రికెటర్లలో ఒకడిగా పేరుగాంచాడు. రోహిత్ నికర విలువ దాదాపు రూ.214 కోట్లుగా ఉంది.
5. హార్దిక్ పాండ్య..
భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా 8వ తరగతి వరకే చదువుకున్నాడు. క్రికెట్‌లో కెరీర్‌ను కొనసాగించడానికి, అతను తొమ్మిదో తరగతిలోనే చదువు ఆపేశాడు. నేడు హార్దిక్ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన మొత్తం సంపద దాదాపు రూ.95 కోట్లుగా మారింది.
6. మొహమ్మద్ షమీ..
భారత స్టార్ బౌలర్ మహ్మద్ షమీ 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తరువాత అతను తన చదువును వదిలివేశాడు. షమీ నికర విలువను పరిశీలిస్తే, ఈ దిగ్గజ భారత బౌలర్ రూ. 47 కోట్ల ఆస్తికి యజమాని.
7. యశస్వి జైస్వాల్..
ఉత్తరప్రదేశ్‌లోని భడోహిలోని ఒక గ్రామంలో జన్మించిన యశస్వి జైస్వాల్ తన ప్రాథమిక విద్యను గ్రామంలోనే అభ్యసించాడు. ఆ తరువాత అతను తన కుటుంబంతో కలిసి ముంబైకి వచ్చాడు. జైస్వాల్ కూడా పెద్దగా చదువుకున్నవాడు కాదు. కానీ, అతని దగ్గర కోట్ల విలువైన సంపద ఉంది. ఆయనకు రూ.16 కోట్ల ఆస్తులు ఉన్నాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








