AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2024: ఎక్ట్స్ పర్ట్స్ అంచనా.. టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరే 4 జట్లు ఇవే! అందరి నోటా ఆ టీమ్ పేరే!

ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా పోటీపడనున్నాయి. ఇందుకోసం టీమిండియాతో సహా మొత్తం 20 జట్లు తమ ఆటగాళ్ల బృందాన్ని ప్రకటించాయి. చాలా టీమ్స్ ఇప్పటికే న్యూయార్క్ కు కూడా చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. మరోవైపు టీ 20 ప్రపంచ కప్ లో గెలుపు గుర్రాలపై అప్పుడే డిబేట్లు మొదలయ్యాయి

T20 World Cup 2024: ఎక్ట్స్ పర్ట్స్ అంచనా.. టీ20 ప్రపంచకప్ సెమీస్ చేరే 4 జట్లు ఇవే! అందరి నోటా ఆ టీమ్ పేరే!
ICC T20 World Cup 2024
Basha Shek
|

Updated on: May 28, 2024 | 5:15 PM

Share

ఐపీఎల్ 2024 సీజన్ ముగిసింది. దీంతో క్రికెట్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు టీ 20 ప్రపంచకప్ పైనే ఉంది. మరో మూడు రోజుల్లో (జూన్ 1) నుంచి ఈ మెగా క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది. ఈసారి ప్రపంచకప్‌లో మొత్తం 20 జట్లు నాలుగు గ్రూప్‌లుగా పోటీపడనున్నాయి. ఇందుకోసం టీమిండియాతో సహా మొత్తం 20 జట్లు తమ ఆటగాళ్ల బృందాన్ని ప్రకటించాయి. చాలా టీమ్స్ ఇప్పటికే న్యూయార్క్ కు కూడా చేరుకుని ప్రాక్టీస్ ప్రారంభించాయి. మరోవైపు టీ 20 ప్రపంచ కప్ లో గెలుపు గుర్రాలపై అప్పుడే డిబేట్లు మొదలయ్యాయి. మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, నిపుణులు టీవీ డిబేట్లలో ప్రపంచకప్ ఆడే జట్లపై తమ అంచనాలు వెల్లడిస్తున్నారు. అలా పొట్టి ప్రపంచకప్ పై తాజాగా స్టార్ స్పోర్ట్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పలువురు మాజీ క్రికెటర్లు పాల్గొన్నారు. సెమీస్ కు చేరే ఇవే జట్లంటూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. వీరిలో అందరూ టీమిండియా తప్పకుండా సెమీస్ చేరుతుందని చెప్పడం విశేషం. అలాగే దక్షిణాఫ్రికా మాజీ ఆల్ రౌండర్ క్రిస్ మోరిస్ మినహా మిగతా వారందరూ ఇంగ్లండ్ కచ్చితంగా సెమీస్ చేరుతుందని జోస్యం చెప్పారు. ఇక ఇదే డిబేట్ లో చాలా మంది పాకిస్తాన్ జట్టు కూడా సమతూకంతో ఉందని, ఆ జట్టు కూడా నాకౌట్ స్టేజ్ కు చేరుతుందన్నారు.

టీ20 ప్రపంచకప్ 2024 సెమీఫైనలిస్టులపై ఎవరు, ఏమన్నారంటే?

  • సునీల్‌ గవాస్కర్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌
  • మాథ్యూ హేడెన్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
  • మహమ్మద్‌ కైఫ్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌
  • అంబటి రాయుడు- భారత్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా
  • పాల్‌ కాలింగ్‌వుడ్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, వెస్టిండీస్‌
  • బ్రియాన్‌ లారా- భారత్‌, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, ఆఫ్ఘనిస్తాన్‌
  • క్రిస్‌ మోరిస్‌- భారత్‌, పాకిస్తాన్‌, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా
  • ఆరోన్‌ ఫించ్‌- భారత్‌, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌
  • టామ్‌ మూడీ- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా
  • శ్రీశాంత్‌- భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌

టీ20 ప్రపంచకప్‌ కోసం టీమిండియా:

రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, యస్సావి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, సంజు శాంసన్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్షదీప్ సింగ్, జస్‌ప్రీత్‌దీప్ సింగ్, బుమ్రా, మహ్మద్ సిరాజ్.

రిజర్వ్‌లు:

శుభమన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!