AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Preity Zinta : మానిప్యులేట్ చేసిందా.. ఐపీఎల్‌లో ప్రీతి జింటా మోసం.. కుండబద్ధలు కొట్టిన స్టార్ ప్లేయర్

పంజాబ్ కింగ్స్ మాజీ ఫాస్ట్ బౌలర్ సందీప్ శర్మ, 2017లో ప్రీతి జింటా ఒక మ్యాచ్ ఫలితాన్ని ఎలా ప్రభావితం చేసిందో వెల్లడించాడు. ఆమె ఆటగాడు అక్షర్ పటేల్‌కు బదులుగా తనకే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ఇవ్వమని బ్రాడ్‌కాస్టర్ రవి శాస్త్రిని ఒప్పించిందని సందీప్ తెలిపాడు.

Preity Zinta : మానిప్యులేట్ చేసిందా.. ఐపీఎల్‌లో ప్రీతి జింటా మోసం.. కుండబద్ధలు కొట్టిన స్టార్ ప్లేయర్
Preity Zinta
Rakesh
|

Updated on: Sep 06, 2025 | 10:41 AM

Share

Preity Zinta : పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా తరచుగా ఐపీఎల్‌లో కనిపిస్తుంటారు. అయితే, పంజాబ్ కింగ్స్ మాజీ పేసర్ సందీప్ శర్మ ఒక సంచలన విషయాన్ని వెల్లడించారు. 2017లో ఆమె తన ప్రదర్శనకు ఎలా ప్రాముఖ్యత ఇచ్చిందో చెప్పాడు. అప్పుడు ఆమె బ్రాడ్‌కాస్టర్ రవి శాస్త్రి ని ఒప్పించి, నిజానికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుకు అర్హుడైన అక్షర్ పటేల్‌కు కాకుండా తనకు ఆ అవార్డును ఇప్పించిందని చెప్పాడు. ఐపీఎల్‌లో గత కొన్నేళ్లుగా చాలా వివాదాస్పద సంఘటనలు జరిగాయి. అలాంటి ఒక సంఘటన ఇప్పుడు పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటాపై ఆరోపణలకు దారితీసింది. పంజాబ్ కింగ్స్ మాజీ పేసర్, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న సందీప్ శర్మ ఇటీవల క్రిక్‌ట్రాకర్ చాట్ షోలో ఈ విషయాన్ని వెల్లడించాడు.

ఈ సంఘటన 2017 నాటిది. అది ఐపీఎల్ సీజన్ 43వ మ్యాచ్. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్​లో కింగ్స్ జట్టు కేవలం 138 పరుగులు మాత్రమే చేయగలిగింది. అక్షర్ పటేల్ 17 బంతుల్లో 38 పరుగులు చేసి జట్టుకు కీలకమైన స్కోరు అందించాడు. ఆ మ్యాచ్​లో అక్షర్ రెండు వికెట్లు కూడా తీశాడు. అతని ఆల్ రౌండర్ ప్రతిభకు గాను అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు ఇవ్వాలని మొదట నిర్ణయించారు. కానీ, ఆ సమయంలో ప్రీతి జింటా కలుగజేసుకుని, అవార్డును సందీప్‌కు ఇవ్వాలని బ్రాడ్‌కాస్టర్‌ను కోరింది. రవి శాస్త్రి కూడా ఆమె ప్రతిపాదనను అంగీకరించి, ఆ మ్యాచ్​లో మూడు ముఖ్యమైన వికెట్లు తీసిన సందీప్ శర్మకు ఆ అవార్డును ఇచ్చాడు.

సందీప్ శర్మ చెప్పిన దాని ప్రకారం.. మేము బెంగళూరులో ఆర్‌సీబీతో ఆడుతున్నప్పుడు.. నేను మూడు వికెట్లు తీశాను. అవి విరాట్ కోహ్లీ, ఏబీ డీవిలియర్స్, క్రిస్ గేల్‌ వికెట్లు. నిజానికి, ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అక్షర్ పటేల్‌కు దక్కాలి. అతను కూడా రెండు వికెట్లు తీశాడు. చివరి ఓవర్‌లో అతను 25 పరుగులు చేశాడు. కానీ, ప్రీతి జింటా అక్కడే ఉండి రవి శాస్త్రికి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సందీప్‌కు ఇవ్వమని చెప్పారు. ఎందుకంటే, అతను మూడు ముఖ్యమైన వికెట్లు తీశాడు. నిజంగా, వారు నాకు ఆ అవార్డు ఇచ్చారు. నేను వెళ్లి ఆ అవార్డును అక్షర్‌కు ఇచ్చాను. కానీ అతను ఆ మూడు వికెట్లు చాలా ముఖ్యమైనవి, లేకపోతే 138 పరుగులను కాపాడలేమని చెప్పాడు” అని సందీప్ తెలిపాడు.

ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఈ ప్రయాణంలో ప్రీతి జింటా చాలా సంతోషంగా కనిపించింది. కోచ్ రికీ పాంటింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ జట్టును అద్భుతంగా నడిపించారు. ప్రీతి జింటా కూడా ఆటగాళ్ల వేలంలో పాల్గొని జట్టును బలోపేతం చేసింది. అయితే, పంజాబ్ కింగ్స్‌కు ఇప్పటికీ వారి మొదటి ఐపీఎల్ టైటిల్ కోసం ఎదురుచూపులు తప్పలేదు.

మరిన్ని క్రికెట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..