నేపాల్ క్రికెట్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మైనర్ బాలికపై అత్యాచారం కేసులో ఆ జట్టు మాజీ కెప్టెన్, అద్భుతమైన లెగ్ స్పిన్నర్ సందీప్ లమిచానే దోషిగా తేలాడు. ఈ కేసుకు సంబంధించి శుక్రవారం (డిసెంబర్ 29) విచారణ జరగ్గా ఖాట్మండు జిల్లా కోర్టు తీర్పు వెలువరిస్తూ సందీప్‌ను దోషిగా ప్రకటించింది. సందీప్ భారత టీ20 లీగ్ ఐపీఎల్‌లో కూడా ఆడాడు. అతను ఈ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ కేసులో సందీప్‌కు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడుతుందో కూడా న్యాయమూర్తి వెల్లడించలేదు. దీనిపై తదుపరి విచారణలో నిర్ణయం రానుంది. లామిచానే ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నాడు. జనవరి 12న పటాన్ హైకోర్టు అతనికి బెయిల్ మంజూరు చేసింది. ఆగస్టు 21న ఖాట్మండు జిల్లా కోర్టు న్యాయవాది 17 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసును దాఖలు చేశారు. క్రిమినల్ కోడ్ 2074లోని సెక్షన్ 219 కింద సందీప్‌పై ఆరోపణలు వచ్చాయి. మైనర్ బాలిక 6 సెప్టెంబర్ 2022న గౌషల్ మెట్రోపాలిటన్ పోలీస్ సర్కిల్‌లో సందీప్‌పై కేసు పెట్టింది. సందీప్ ప్రస్తుతం కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రినిడాడ్ అండ్ టొబాగో తరపున ఆడుతున్నాడు. అక్టోబరు 6న నేపాల్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆరోపణలు రావడంతో సందీప్ బ్యాంకు ఖాతా, ఆస్తులను సీజ్ చేశారు.
సందీప్ రెండేళ్ల పాటు ఐపీఎల్ ఆడాడు. అతను 2018, 2019 సీజన్లలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. నేపాల్ తరఫున 51 వన్డే మ్యాచ్‌లు ఆడిన సందీప్ 112 వికెట్లు తీశాడు. 20 టీ20 మ్యాచుల్లో నేపాల్ తరఫున 98 వికెట్లు తీశాడు. సందీప్ ప్రపంచవ్యాప్తంగా టీ20 లీగ్‌లలో ఆడుతాడు. అతను ఆస్ట్రేలియా బిగ్ బాష్ లీగ్‌లో కూడా ఆడతాడు. అయితే ఈ కేసు తర్వాత అతని క్రికెట్ కెరీర్‌పై పెద్ద ప్రశ్నార్థకమైంది. మరి సందీప్‌కి ఎన్ని సంవత్సరాల శిక్ష పడుతుందో చూడాలి.
Sandeep Lamichhane found guilty in minor’s rape case.
– The next hearing will determine the jail term. pic.twitter.com/YEnJD9K5rm
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 29, 2023
Ex-Nepal cricket captain Sandeep Lamichhane convicted of raping a minor; awaits sentencing; may face fine and prison. 🏏⚖️
Courtesy: Kathmandu Post
.
.#SandeepLamichhane #Cricket #sports #LamichhaneLegalCase #CricketControversy #SportsLegalMatter #SandeepLamichhaneNews… pic.twitter.com/JRUxS61J5d— Machaao For Cricket (@MachaaoApp) December 29, 2023
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..