Vinod Kambli: వినోద్ కాంబ్లీకి జీవితాంతం ఉచిత చికిత్స.. సచిన్‌ను తల్చుకుని ఎమోషనలైన మాజీ క్రికెటర్
ఇటీవల ముంబైలోని శివాజీ పార్క్ మైదానంలో రమాకాంత్ అచ్రేకర్ స్మారకార్థం ఓ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అక్కడ వీల్ చైర్‌లో దీన స్థితిలో కూర్చొన్న వినోద్ కాంబ్లీని చూసి అందరూ షాక్ అయ్యారు
టీమిండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ప్రస్తుతం థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాంబ్లీ తీవ్రమైన యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌తో పాటు పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అలాగే ఆయన మెదడులో రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెబుతున్నారు. ఇదే సమయంలో కాంబ్లీ చికిత్సకు పూర్తిగా సహకారిస్తున్నాడని వైద్యులు చెబుతున్నారు. కాగా భారత క్రికెట్ కు కాంబ్లీ అందించిన సేవలకు ప్రతీకగా ఆకృతి ఆస్పత్రి ఆయనకు జీవితాంతం వైద్య చికిత్సలు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. ఆస్పత్రీ తీసుకున్న ఈ నిర్ణయంపై కాంబ్లీ కుటుంబ సభ్యులు, క్రికెట్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వినోద్ కాంబ్లీకి జీవితాంతం ఉచిత చికిత్స అందించాలని ఆసుపత్రి ఇన్‌ఛార్జ్ డాక్టర్ ఎస్.సింగ్ నిర్ణయించారు. కాంబ్లీ వైద్య ఖర్చులన్నింటినీ ఆకృతి హాస్పిటల్ చూసుకుంటుంది. కాబట్టి భారత జట్టు మాజీ ఆటగాడు ఇక నుంచి ఎలాంటి చికిత్స గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మేం ఆయన ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నాం’ అని కాంబ్లీకి ట్రీట్మెంట్ అందిస్తోన్న వైద్యుడొకరు చెప్పుకొచ్చారు.
ఇక ఆసుపత్రిలో చికిత్స గురించి వినోద్ కాంబ్లీ మాట్లాడుతూ వైద్యుల సలహాలు, సూచనలను తప్పకుండా పాటిస్తానని చెప్పాడు. అలాగే ఈ వైద్యుడి వల్లే తాను ఇప్పటికీ బతికి ఉన్నానంటూ ఎమోషనల్ అయ్యాడు. వైద్య బృందం తన పట్ల చూపుతోన్న శ్రద్ధను చూసి కంటతడి పెట్టుకున్నారు.
ఆకృతి ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ..
VIDEO | Former Indian cricketer Vinod Kambli was admitted to Akruti Hospital, a private facility in Thane, Maharashtra, on Saturday, December 21, after his health condition deteriorated.
The 52-year-old was brought to the hospital by one of his fans who also owns the hospital in… pic.twitter.com/128LnbYkcu
— Press Trust of India (@PTI_News) December 23, 2024
సచిన్ కు మళ్లీ కృతజ్ఞతలు తెలిపిన వినోద్ కాంబ్లీ..
#WATCH | Maharashtra: Former Indian Cricketer Vinod Kambli says, “I am feeling better now…I will never leave this (cricket) because I remember the number of centuries and double centuries I have hit…We are three left-handers in the family. I am thankful to Sachin Tendulkar as… https://t.co/ZQsUuVV1pO pic.twitter.com/Xj8UQbAgmQ
— ANI (@ANI) December 24, 2024
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..