AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో.. స్వయంగా చెప్పిన క్రికెట్ దిగ్గజం

టీమిండియా క్రికెట్ దిగ్గజం, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ బయోపిక్ పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఎవరు నటిస్తారు? ఎవరు దర్శకత్వం వహిస్తారు? సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది? తదితర ఊహాగానాలపై స్వయంగా గంగూలీ స్పందించాడు.

Sourav Ganguly: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో.. స్వయంగా చెప్పిన క్రికెట్ దిగ్గజం
Sourav Ganguly
Basha Shek
|

Updated on: Feb 21, 2025 | 4:10 PM

Share

భారత క్రికెట్ జట్టు రూపు రేఖలు మార్చిన సౌరవ్ గంగూలీ బయోపిక్ పై ఎప్పటి నుంచో చర్చ జరుగుతోంది. ఎందరో స్టార్ హీరోలు, డైరెక్టర్ల పేర్లు వినిపించాయి. అయితే మూవీ మాత్రం పట్టాలెక్కడం లేదు. తాజాగా ఈ బయోపిక్ పై సౌరవ్ గంగూలీనే స్వయంగా స్పందించాడు. గురువారం ఒక కార్యక్రమానికి హాజరు కావడానికి ఆయన బుర్ద్వాన్ వెళ్లారు. అక్కడ, తన బయోపిక్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను విన్నంతవరకు.. టైటిల్‌ రోల్‌లో రాజ్‌ కుమార్‌ రావ్‌ నటించనున్నారు. అయితే డేట్స్‌ సర్దుబాటులో కొంత సమస్య ఉంది. అందువల్ల సినిమా విడుదలయ్యేందుకు మరో ఏడాదిపైనే సమయం పట్టొచ్చు’ అని గంగూలీ చెప్పుకొచ్చారు” ఈ వార్త వెలువడిన వెంటనే అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. యాదృచ్ఛికంగా, సౌరవ్ బయోపిక్ గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. సౌరవ్ పాత్రను ఎవరు పోషిస్తారనే దానిపై ఆసక్తి కూడ పెరిగింది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా నుంచి రణబీర్ కపూర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే చివరికి రాజ్ కుమార్ రావు పేరునే ఖరారు చేసినట్లు తెలుస్తోంది.

కాగా గతేడాది స్త్రీ 2 సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు రాజ్ కుమార్ రావు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మొత్తం 800 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. అంతకు ముందు ప్రముఖ పారిశ్రామికవేత్త, బొల్లాంట్‌ ఇండస్ట్రీస్‌ వ్యవస్థాపకుడు శ్రీకాంత్‌ బొల్లా జీవితం ఆధారంగా తెరకెక్కిన శ్రీకాంత్ సినిమాలో రాజ్ కుమార్ రావు అద్భుతంగా నటించాడు. ఈ నేపథ్యంలోనే భారత జట్టులో దాదాగా పేరొందిన సౌరవ్ గంగూలీ బయోపిక్‌లోనూ రాజ్ కుమార్ రావును ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

రాజ్‌కుమార్ రావు కంటే ముందు, సౌరవ్ గంగూలీ బయోపిక్ లో నటించేందుకు ఇద్దరు బాలీవుడ్ సూపర్ స్టార్ల పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఆయుష్మాన్ ఖురానా, రణబీర్ కపూర్‌లను దాదా పాత్ర కోసం సంప్రదిచారట. అయితే ఎందుకోగానీ ఇప్పుడు అనూహ్యంగా రాజ్ కుమార్ రావ్ పేరు తెరపైకి వచ్చింది.

త్వరలోనే..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
వద్దురా నాయనా సర్కారీ దవాఖాన.. వైద్యం కోసం వచ్చిన రోగికి..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
నాకు వీడు వద్దు.. తెగేసి చెప్పిన ప్రేమ.. ధీరజ్ మనసును ముక్కలు..
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
గాడ నిధ్రలో ఉండగా ఊహించని ప్రమాదం.. ఇద్దరు మృతి
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
ఇంటికి ఏ తలుపులు మంచివి? చెక్క, WPC, PVC డోర్లలో ఏది బెస్ట్?
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
యూపీఐ ద్వారా పీఎఫ్ విత్ డ్రా.. అప్పటినుంచే అందుబాటులోకి..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
మజిలీ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ? ఇప్పుడు చూస్తే ..
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
పడవతో రోడ్డుపైకి జనాలు.. కంపెనీకి రూ.50వేల జరిమానా?
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఉరేసుకొని కానిస్టేబుల్ ఆత్మహత్య!
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
మనం కట్టిన ప్రీమియం డబ్బులతో ఎల్‌ఐసీ ఏం చేస్తుందో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?
డీమార్ట్‌లో కొనడం కాదు.. మీ వస్తువులను అమ్మడం ఎలాగో తెలుసా..?