Team India: 12 ఏళ్ల క్రితం భారత్ కెప్టెన్‌.. కట్ చేస్తే.. ఐపీఎల్‌‌లో పోలీస్ ఆఫీసర్‌గా..

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో.. ఒకప్పుడు టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న ఓ క్రీడాకారుడు.. ప్రస్తుతం ఆటగాళ్లకు సెక్యూరిటీగా రక్షణ బాధ్యతలు నిర్వహించాడు.

Team India: 12 ఏళ్ల క్రితం భారత్ కెప్టెన్‌.. కట్ చేస్తే.. ఐపీఎల్‌‌లో పోలీస్ ఆఫీసర్‌గా..
Indian Premier League 2023: ఐపీఎల్ 16వ సీజన్‌లో ఇప్పటివరకు సగానికి పైగా లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. ఈ సీజన్‌లో కూడా భారత ఆటగాళ్లతో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా తమ ఆటతీరుతో ఆకట్టుకుంటున్నారు. వీరు జట్టుకు మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాలని చూస్తున్నారు. ఇందులో ప్రముఖంగా డెవాన్ కాన్వే, జోస్ బట్లర్, రషీద్ ఖాన్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఇప్పటివరకు తమ జట్టు కోసం మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనలు ఇచ్చిన ఐదుగురు విదేశీ ఆటగాళ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 21, 2023 | 5:04 PM

ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయంటే ఇదేనేమో.. ఒకప్పుడు టీమిండియాకు కెప్టెన్‌గా ఉన్న ఓ క్రీడాకారుడు.. ప్రస్తుతం ఆటగాళ్లకు సెక్యూరిటీగా రక్షణ బాధ్యతలు నిర్వహించాడు. ఈ ఘటన పంజాబ్‌లో చోటుచేసుకుంది. ఐపీఎల్‌-2023లో భాగంగా మొహాలీ వేదికగా పంజాబ్‌ కింగ్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడ్డాయి. అయితే మొహాలీ స్టేడియం వద్ద భారత పురుషుల హాకీ జట్టు మాజీ కెప్టెన్‌ రాజ్‌పాల్ సింగ్ పోలీస్‌ ఆఫీసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ కనిపించాడు.

2011లో భారత కెప్టెన్‌గా పనిచేసిన రాజ్‌పాల్ సింగ్.. ప్రస్తుతం మొహాలీ ట్రాఫిక్‌ డీఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. స్టేడియం మొయిన్‌ గేట్‌ వద్ద సెక్యూరిటీగా ఉన్న రాజ్‌పాల్ సింగ్‌.. తన సహచరులతో కలిసి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకున్నాడు. కాగా ఐపీఎల్‌ మ్యాచ్‌లే కాకుండా గత కొంత కాలంగా అంతర్జాతీయ మ్యాచ్‌ల సమయంలో కూడా తన విధులు నిర్వహించినట్లు రాజ్‌పాల్‌ చెప్పుకొచ్చాడు.

స్టేడియం వద్ద పరిస్థితులను ఎలా కంట్రోల్‌ చేయాలో తనకు బాగా తెలుసని, ఇదంతా డ్యూటీలో భాగమని రాజ్‌పాల్ సింగ్ పేర్కొన్నాడు. కాగా రాజ్‌పాల్‌ మొట్టమొదటి కామన్వెల్త్ గేమ్స్ పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టుకు నాయకత్వం వహించాడు. అదే విధంగా 2011 ఆసియా పురుషుల హాకీ చాంపియన్స్‌ ట్రోఫీని అతడి సారథ్యంలోనే భారత్‌ సొంతం చేసుకుంది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి టైటిల్‌ను భారత జట్టు సొంతం చేసుకుంది.

Rajpal Singh