పెద్ద మనసు చాటుకున్న మాజీ క్రికెటర్ .. బర్త్‌ డే వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు..

ఇండియన్ మాజీ క్రికెటర్ సురేశ్‌రైనా దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అలాగే నిజజీవితంలో కూడా ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు.

  • uppula Raju
  • Publish Date - 12:30 pm, Tue, 24 November 20
పెద్ద మనసు చాటుకున్న మాజీ క్రికెటర్ .. బర్త్‌ డే వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు..

ఇండియన్ మాజీ క్రికెటర్ సురేశ్‌రైనా దేశానికి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అలాగే నిజజీవితంలో కూడా ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఈ నెల 27న తన పుట్టిన రోజును పురస్కరించుకొని 34 ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక సదుపాయాలను సమకూర్చనున్నాడు. తన కూతురు పేరుతో ఉన్న ఎన్జీవో గ్రేసియా రైనా పౌండేషన్ తరపున, ఉత్తరప్రదేశ్, జమ్ము ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య, తాగునీరు, టాయిలెట్లు, హ్యాండ్‌వాష్‌, డిష్‌ వాషింగ్‌ ఏరియా, స్మార్ట్‌ క్లాస్‌రూమ్స్‌లను కల్పిస్తున్నాడు. దీనివల్ల పదివేల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. తన పుట్టిన రోజు వేడుకలు ప్రారంభించిన సందర్భంగా తన భార్య ప్రియాంకతో కలిసి 500 మంది పేద మహిళలకు రేషన్ కిట్స్ అందించారు. ఇలా అందరితో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని రైనా దంపతులు ప్రకటించారు.