ఛాంపియన్స్ ట్రోఫీలో బ్యాటర్లను మడతెట్టేసిన బౌలర్లు వీరే.. లిస్టులో టీమిండియా తోపు ప్లేయర్.. ఎవరంటే

ఫిబ్రవరి 19 నుంచి పాకిస్తాన్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ మొదలు కానుంది. మొదటి మ్యాచ్ పాకిస్తాన్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఇదిలా ఉంటే.. ఇప్పటిదాకా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నీలలో అత్యల్ప ఎకానమీ రేటు ఇచ్చిన బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా..

ఛాంపియన్స్ ట్రోఫీలో బ్యాటర్లను మడతెట్టేసిన బౌలర్లు వీరే.. లిస్టులో టీమిండియా తోపు ప్లేయర్.. ఎవరంటే
Champions Trophy 2025

Updated on: Feb 17, 2025 | 4:31 PM

పాకిస్తాన్ ఆతిధ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ సమరం మరో రెండు రోజుల్లో మొదలుకానుంది. ఈ టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఆతిధ్య పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు తలబడనున్నాయి. ఇదిలా ఉండగా.. ఇప్పటిదాకా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌లలో అత్యల్ప ఎకానమీ ఉన్న 5గురు బౌలర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందామా.. ఈ లిస్టులో టీమిండియా తోపు ప్లేయర్ కూడా ఉన్నాడు. మరి అలాంటి పొదుపు బౌలింగ్ వేసిన బౌలర్లు ఎవరంటే.?

అరవింద డి సిల్వా..

ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ మ్యాచ్‌ల చరిత్రలో అత్యుత్తమ ఎకానమీ రేటుతో బౌలింగ్ చేసిన బౌలర్ శ్రీలంక మాజీ గ్రేట్ అరవింద్ డి సిల్వా. డిసిల్వా 7 మ్యాచ్‌ల్లో 10 ఓవర్లు బౌలింగ్ చేసి, రెండు మెయిడెన్ ఓవర్లు వేశాడు. అతను 60 బంతుల్లో 16 పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. ఎకానమీ రేటు 1.60గా ఉంది, ఇదే టోర్నీలో అత్యల్పం.

వేవెల్ హిండ్స్

వేవెల్ హిండ్స్ వెస్టిండీస్ మాజీ ఆటగాడు. పొదుపుగా బౌలింగ్ వేసిన బౌలర్ల లిస్టులో వేవెల్ హిండ్స్ రెండవ స్థానంలో ఉన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ దశలో, అతడు 11 మ్యాచ్‌ల్లో 20 ఓవర్లు బౌలింగ్ చేశాడు. వేవెల్ మూడు మెయిడెన్ ఓవర్లు వేసి 51 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టాడు. హిండ్స్ ఎకానమీ రేటు 2.55.

ఇవి కూడా చదవండి

షేన్ వార్న్

ఆస్ట్రేలియా మాజీ లెజెండ్, దివంగత బౌలర్ షేన్ వార్న్ తన స్పిన్‌తో ప్రపంచంలోని గొప్ప బ్యాట్స్‌మెన్‌లను కూడా పడగొట్టాడు. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్‌గా పరిగణించబడే వార్న్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్‌ మ్యాచ్‌లలో 3 మ్యాచ్‌లకు గానూ 20.2 ఓవర్లు బౌలింగ్ చేశాడు. అతని ఎకానమీ రేటు 2.95. ఇందులో వార్న్ నాలుగు మెయిడెన్ ఓవర్లు బౌలింగ్ చేసి 122 బంతుల్లో 60 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు.

జస్టిన్ ఒంటాంగ్

దక్షిణాఫ్రికా తరఫున 44 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన జస్టిన్ ఒంటాంగ్ ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాడు. జస్టిన్ ఒకే ఒక్క నాకౌట్ మ్యాచ్ ఆడాడు. 10 ఓవర్లలో, జస్టిన్ ఒక మెయిడెన్ ఓవర్ వేసి మొత్తం 30 పరుగులు ఇచ్చాడు. ఎకానమీ రేటు 3గా ఉంది.

రమేష్ పొవార్

ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ ఆటగాడు రమేష్ పొవార్. జస్టిన్ లాగే, అతడు కూడా ఒకే ఒక్క నాకౌట్ మ్యాచ్ ఆడాడు. 8 ఓవర్లు బౌలింగ్ చేసిన రమేష్ 24 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. పొవార్ ఎకానమీ రేటు కూడా 3గా ఉంది. ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్ చరిత్రలో ఐదవ అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి