నీ కష్టం పగవాడికి కూడా రావద్దు బ్రో.. తగలరాని చోట బంతి తగిలి విలవిల్లాడిన క్రికెటర్‌.. వైరల్‌ వీడియో

|

Mar 25, 2023 | 9:58 AM

యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌ టోర్నీలోనూ ఒక ఆసక్తిర సన్నివేశం చోటు చేసుకుంది. ఫీల్డర్‌ వేసిన బంతి పొరపాటుగా పరుగు తీస్తున్న బ్యాటర్‌కు తగిలింది. అయితే తగలరాని చోట బంతి తలగడంతో నొప్పితో విలవిల్లాడాడు. చాలా సేపు ఉన్న చోటే నిలబడిపోయాడు.

నీ కష్టం పగవాడికి కూడా రావద్దు బ్రో.. తగలరాని చోట బంతి తగిలి విలవిల్లాడిన క్రికెటర్‌.. వైరల్‌ వీడియో
Cricket Match
Follow us on

క్రికెట్‌ మ్యాచుల్లో అప్పుడప్పుడు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అందులో కొన్నిటినీ చూస్తుంటే ఆటోమెటిక్‌గా నవ్వు వస్తుంటుంది. అదే మరికొన్ని సార్లు అయ్యోపాపం అనుకునేలా మైదానంలో చిత్ర విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటాయి. తాజాగా యూరోపియన్‌ క్రికెట్‌ లీగ్‌ టోర్నీలోనూ ఒక ఆసక్తిర సన్నివేశం చోటు చేసుకుంది. ఫీల్డర్‌ వేసిన బంతి పొరపాటుగా పరుగు తీస్తున్న బ్యాటర్‌కు తగిలింది. అయితే తగలరాని చోట బంతి తలగడంతో నొప్పితో విలవిల్లాడాడు. చాలా సేపు ఉన్న చోటే నిలబడిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. యూరోపియన్‌ లీగ్‌లో భాగంగా బ్రదర్స్‌ ఎలెవెన్‌, ఇండియన్‌ రాయల్స్‌ మధ్య 10 ఓవర్ల మ్యాచ్‌ జరిగింది. ఇండియన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో క్రీజులో ఉన్న బ్యాటర్‌ బంతిని మిడాన్‌ దిశగా ఆడాడు. సింగిల్‌ కూడా పూర్తి చేశారు. అయితే ఫీల్డర్‌ బంతిని మిస్‌ చేయడంతో రెండో పరుగు కోసం పరిగెత్తాడు. ఇదే సమయంలో బంతిని అందుకున్న మరో ఫీల్డర్‌ నాన్‌ స్ట్రైక్‌ ఎండ్‌ వేపు వేగంగా విసిరాడు.

అయితే బంతి పొరపాటుగా నాన్‌స్ట్రైక్‌ క్రీజులోకి వచ్చిన బ్యాటర్‌ పొట్ట కింది భాగంలో తగిలింది. పాపం దెబ్బ గట్టిగానే తగిలిందేమో నొప్పితో కాసేపు విలవిల్లాడాడు. పక్కకు కూడా కదల్లేకపోయాడు. అయితే సేఫ్‌ గార్డ్‌ ఉండడంతో ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. చాలామంది వీడియోను చూసి నవ్వుకుంటున్నారు. అదే సమయంలో అతని కష్టం పగవాడికి కూడా రావద్దు బ్రో అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇందులో బ్రదర్స్‌ ఎలెవెన్‌ జట్టు విజయం సాధించింది. వర్షం కారణంగా డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం విజేతను నిర్ణయించారు. ఇరుజట్ల స్కోర్లు సమానంగా ఉండడంతో గోల్డెన్‌ బాల్‌కు అవకాశం ఇచ్చారు. గోల్డెన్‌ బాల్‌లో బ్రదర్స్‌ ఎలెవెన్‌ జట్టు విజయం సాధించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..