IPL 2023: ఆ రెండు జట్ల మధ్యే ఐపీఎల్‌ ‘థౌజండ్‌’ వాలా మ్యాచ్‌.. ఈసారి మరిన్ని విశిష్టతలతో ధనాధన్‌ క్రికెట్‌ లీగ్‌

గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి ఐపీఎల్‌ కు ఎన్నో విశిష్టతలున్నాయి. ఈ సీజన్‌లోనే ఐపీఎల్‌ 1000 వ మ్యాచ్‌ జరగనుంది? మరి ఆ థౌజండ్‌ వాలా మ్యాచ్‌ ఏయే జట్ల మధ్య జరగనుంది? ఐపీఎల్‌- 2023కున్న ప్రత్యేకతలేంటో ఓసారి తెలుసుకుందాం రండి.

IPL 2023: ఆ రెండు జట్ల మధ్యే ఐపీఎల్‌ 'థౌజండ్‌' వాలా మ్యాచ్‌.. ఈసారి మరిన్ని విశిష్టతలతో ధనాధన్‌ క్రికెట్‌ లీగ్‌
Ipl 2023
Follow us

|

Updated on: Mar 25, 2023 | 12:08 PM

ఐపీఎల్‌ 16వ ఎడిషన్‌కు కౌంట్‌డౌన్‌ మొదలైంది. 2008లో ప్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్16వ సీజన్ మార్చి 31 నుంచి ప్రారంభం కానుంది. పది జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, మహేంద్ర సింగ్ ధోనీ, బెన్ స్టోక్స్ సహా ప్రపంచంలోని పలువురు ప్రముఖ క్రికెటర్ల మధ్య సుమారు రెండు నెలల పాటు ధనాధన్‌ క్రికెట్‌ సమరం జరగనుంది. అయితే గత సీజన్లతో పోల్చుకుంటే ఈసారి ఐపీఎల్‌ కు ఎన్నో విశిష్టతలున్నాయి. ఈ సీజన్‌లోనే ఐపీఎల్‌ 1000 వ మ్యాచ్‌ జరగనుంది? మరి ఆ థౌజండ్‌ వాలా మ్యాచ్‌ ఏయే జట్ల మధ్య జరగనుంది? ఐపీఎల్‌– 2023కున్న ప్రత్యేకతలేంటో ఓసారి తెలుసుకుందాం రండి.

  • ఈ ఐపీఎల్‌లో ఎప్పటిలాగే మొత్తం 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గత సీజన్‌లోనూ ఇలాగే చేసినా ఈసారి షెడ్యూల్‌లో కాస్త మార్పు చేశారు. అదేంటంటే.. ఈసారి గ్రూప్‌లోని ప్రతి జట్టు మరో గ్రూప్‌లోని ఐదు జట్లతో రెండేసి మ్యాచ్‌లు ఆడుతుంది. కానీ సొంత గ్రూప్‌లోని మిగిలిన 4 జట్లతో ఒక మ్యాచ్ మాత్రమే ఆడుతుంది.
  • టోర్నీలో మొత్తం 74 మ్యాచ్‌లు జరగనుండగా, అందులో 70 మ్యాచ్‌లు లీగ్ దశలోనే ఉంటాయి. ఈ 70 మ్యాచ్‌లు 12 నగరాల్లో జరగనున్నాయి. మొత్తం 10 జట్ల హోమ్ గ్రౌండ్‌తో పాటు గౌహతి, ధర్మశాలలో కూడా మ్యాచ్‌లు జరగనున్నాయి. గౌహతిలో తొలిసారిగా ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి.
  • మార్చి 31 నుంచి మే 28 వరకు మొత్తం 18 డబుల్ హెడర్ మ్యాచ్‌లతో ఈ టోర్నీ జరగనుంది. అంటే ఒకే రోజు రెండు మ్యాచ్‌లు జరుగుతున్నాయి. గతసారి మాదిరిగానే రోజూ తొలి మ్యాచ్ మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభం కానుండగా.. సాయంత్రం మ్యాచ్‌లన్నీ రాత్రి 7.30 గంటల నుంచి జరుగుతాయి.
  • ఈ సీజన్‌లో మరో ప్రత్యేకత ఏమిటంటే.. లీగ్‌లో 1000వ మ్యాచ్ జరగనుంది. మే 6న లీగ్‌లోని రెండు విజయవంతమైన జట్లైన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఈ సూపర్‌ మ్యాచ్‌ జరగనుంది.
  • మార్చి 31 నుంచి మే 21 వరకు జరగనున్న లీగ్ మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే ఇప్పటివరకు విడుదల చేసింది బీసీసీఐ. ప్లేఆప్స్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల షెడ్యూల్ టోర్నమెంట్ మధ్యలో రిలీజ్‌ కానుంది.
  • భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తొలిసారిగా ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఆలాగే రిషబ్ పంత్ కూడా మొదటిసారి ఐపీఎల్‌ ఆడడం లేదు.
  • ఈ ఐపీఎల్‌లో ముగ్గురు కొత్త కెప్టెన్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. పంజాబ్ కింగ్స్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా చేయగా, ఎస్‌ఆర్‌హెచ్ బాధ్యతలను ఐడెన్ మార్క్‌రామ్‌కు అప్పగించింది. రిషబ్ పంత్ గైర్హాజరీలో డేవిడ్ వార్నర్ ఢిల్లీకి నాయకత్వం వహించనున్నాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా ఐపీఎల్‌లో ఆడటం సందేహాస్పదంగా ఉన్నందున, KKR కూడా కొత్త కెప్టెన్‌ని ఎంపిక చేయాల్సి ఉంది.
  • కరోనా కారణంగా గత 3 సీజన్‌లు బయో బబుల్‌లోనే జరిగాయి. అయితే ఈసారి లీగ్‌కు ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు ఉండడం లేదు.
  • ఐపీఎల్‌ 2020, 21 సీజన్‌లో సగం మ్యాచ్‌లు యూఏఈలోనే జరిగాయి. ఆ తర్వాత, 2022 ఎడిషన్ లీగ్ మ్యాచ్‌లు మొత్తం ముంబైలో జరిగాయి. ఫైనల్‌తో సహా ప్లేఆఫ్ మ్యాచ్‌లు అహ్మదాబాద్, కోల్‌కతాలో జరిగాయి. అయితే ఈసారి అన్ని ప్రధాన నగరాల్లోనూ మ్యాచ్‌లు జరగనున్నాయి.
  • ఈ ఎడిషన్‌లో బయో బబుల్ ఆంక్షలు తొలగించినప్పటికీ కరోనా నిబంధనలను అలాగే అమలు చేయనున్నారు. అంటే ఏ ఆటగాడికైనా కరోనా సోకితే వారం రోజుల పాటు ఐసోలేషన్‌లో ఉండాల్సిందే.
  • ఈసారి ఐపీఎల్‌లోనూ కొత్త నిబంధనలు వచ్చాయి. వీటిలో ప్రధానమైనది ఇంపాక్ట్ ప్లేయర్. దీని ప్రకారం, ప్రతి జట్టు మ్యాచ్ సమయంలో ఏదైనా ఇన్నింగ్స్‌లో ఒక ఆటగాడిని భర్తీ చేయడానికి అనుమతించబడుతుంది. అయితే ఔట్ అయిన ఆటగాడు ఆ మ్యాచ్‌లో మళ్లీ ఆడలేడు.
  • ఇది కాకుండా, ప్లేయింగ్ ఎలెవెన్‌లో కూడా మార్పులు చేయవచ్చు. అంటే, ఇకమీదట ప్రతి జట్టు కెప్టెన్ టాస్ సమయంలో ఇద్దరు ప్లేయింగ్ ఎలెవెన్‌లను సిద్ధంగా ఉంచుకోవచ్చు. టాస్ తర్వాత, బ్యాటింగ్ లేదా బౌలింగ్ ప్రకారం ప్లేయింగ్ ఎలెవెన్‌ను ఎంచుకోవచ్చు.
  • ఇకపై వైడ్ లేదా నో బాల్ నిర్ణయాలపై కూడా DRS తీసుకునే అవకాశం ఉంది.
  • అలాగే, స్లో ఓవర్లకు కూడా జరిమానా విధించబడుతుంది, ఈ నియమం ప్రకారం బౌలింగ్ జట్టు నిర్ణీత సమయంలో ఓవర్ పూర్తి చేయకపోతే, మిగిలిన ఓవర్లలో, ఫీల్డింగ్ జట్టు 30 గజాల సర్కిల్ వెలుపల 5 మంది ఫీల్డర్లకు బదులుగా 4 మంది ఫీల్డర్లను మాత్రమే ఉంచాలి.
  • మరోవైపు, బౌలింగ్ చేస్తున్నప్పుడు వికెట్ కీపర్ లేదా ఫీల్డర్లు తమ స్థానాన్ని మార్చుకుంటే, ఆ బంతిని డెడ్ బాల్‌గా ప్రకటించి, బ్యాటింగ్ చేసిన జట్టుకు బోనస్‌గా 5 పరుగులు ఇస్తారు.
  • ఆయా జట్లకు చెందిన పలువురు స్టార్‌ ప్లేయర్లు IPL 16వ సీజన్‌లో ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇంగ్లండ్‌కు చెందిన వెటరన్ జో రూట్, యంగ్ సెన్సేషన్‌ హ్యారీ బ్రూక్, ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్, బంగ్లాదేశ్ డాషింగ్ బ్యాటర్‌ లిటన్ దాస్, న్యూజిలాండ్‌కు చెందిన మైకేల్ బ్రేస్‌వెల్, ఐర్లాండ్ పేసర్‌ జోష్ లిటిల్ పేర్లు మొదటిసారి ఐపీఎల్‌లో ఆడుతున్నారు.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..