13 బంతుల్లో 72 పరుగులు.. భారీ సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. 8 ఓవర్లలో మ్యాచ్ పూర్తి.!

Cricket News: అంతర్జాతీయ క్రికెట్ మెరుగులు దిద్దుకుంటోంది. టెస్టులతో మొదలైన ఫార్మాట్లు.. ఆ తర్వాత వన్డేలు.. నెక్స్ట్ టీ20లు.. టీ10.. ఇప్పుడు లేటెస్ట్‌గా..

13 బంతుల్లో 72 పరుగులు.. భారీ సిక్సర్లతో బౌలర్ల ఊచకోత.. 8 ఓవర్లలో మ్యాచ్ పూర్తి.!
European League
Follow us
Ravi Kiran

|

Updated on: Oct 02, 2021 | 9:45 AM

అంతర్జాతీయ క్రికెట్ మెరుగులు దిద్దుకుంటోంది. టెస్టులతో మొదలైన ఫార్మాట్లు.. ఆ తర్వాత వన్డేలు.. నెక్స్ట్ టీ20లు.. టీ10.. ఇప్పుడు లేటెస్ట్‌గా 100 బంతుల టోర్నమెంట్ వచ్చింది. ఇంగ్లాండ్‌లో జరుగుతోన్న ఈ టోర్నమెంట్ ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో హాట్ టాపిక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం యూరోపియన్ క్రికెట్ లీగ్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా సాగుతున్నాయి. తాజాగా జరిగిన ఓ మ్యాచ్‌లో ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిసింది.

శుక్రవారం ఇటలీ, చెక్ రిపబ్లిక్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన చెక్ రిపబ్లిక్ 10 ఓవర్లలో 144 పరుగులు చేసింది. రిపబ్లిక్ జట్టు ఓపెనర్లు మంచి శుభారంభాన్ని అందించారు. తద్వారా మిగిలిన బ్యాట్స్‌మెన్లు కూడా సహకారం అందించడంతో ఆ జట్టు భారీ స్కోర్ సాధించగలిగింది.

ఇక 145 పరుగుల భారీ టార్గెట్‌ను చేధించే క్రమంలో ఇటలీ జట్టు చరిత్ర సృష్టించింది. బరిలోకి దిగిన ఆ జట్టు ఓపెనర్లు మ్యాచ్‌ను ఎనిమిది ఓవర్లలోనే ముగించారు. ఇటలీ ఓపెనర్లు నాసర్ అహ్మద్, ఇషాన్ షరీఫ్‌లు మొదటి వికెట్‌కు 145 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. తుఫాను బ్యాటింగ్‌తో చెలరేగిపోయారు.

13 బంతుల్లో 72 పరుగులు..

ఇటలీ ఓపెనర్ అమీర్ షరీఫ్ 26 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఇక రెండో ఓపెనర్ నాసిర్ అహ్మద్ 22 బంతుల్లో 51 పరుగులు చేసి చక్కటి సహకారాన్ని అందించాడు. ఈ ఇద్దరు తమ జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.