
What happened to Josh Baker: ఇంగ్లండ్ వర్ధమాన క్రికెటర్ జోష్ బేకర్ 20 ఏళ్ల వయసులో గురువారం రాత్రి ప్రపంచానికి వీడ్కోలు పలికాడు. అతని మరణంతో యావత్ క్రికెట్ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఈ వార్తతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే కేవలం ఒక రోజు ముందు, అతను సోమర్‌సెట్‌తో రెండవ XI కోసం మ్యాచ్ ఆడాడు. మే 2 న, అతను మూడవ రోజు ఆటలో మళ్లీ మైదానంలోకి దిగవలసి వచ్చింది. మూడోరోజు కూడా ఫీల్డ్‌కి రాకపోవడంతో మరణవార్త వెలుగులోకి వచ్చింది.
వోర్సెస్టర్‌షైర్ తరపున ఆడుతున్న బేకర్‌కు అతని క్లబ్ హృదయ విదారక వార్తను అందించింది. అతని మరణానికి గల కారణాన్ని అతని క్లబ్ వెల్లడించనప్పటికీ, ఇప్పుడు అతని మరణానికి సంబంధించి అసలు కారణం వెలుగులోకి వచ్చింది. డైలీ మెయిల్ నివేదిక ప్రకారం, బేకర్ మూడో రోజు ఆట కోసం మైదానంలోకి వెళ్లాల్సి ఉంది. కానీ, మూడో రోజు ఆట ప్రారంభంలో అతను కనిపించలేదు.
🌀 Josh Baker has three wickets for the seconds today in their match against Somerset.
Follow ➡️ https://t.co/NEBX7AV4EM pic.twitter.com/zGWvxxzDjW
— Worcestershire CCC (@WorcsCCC) May 1, 2024
దీంతో అతడిని సంప్రదించేందుకు స్నేహితులు తీవ్రంగా ప్రయత్నించారు. అతడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫలితం లేకపోయింది. ఫోన్ చేసినా స్పందించకపోవడంతో స్నేహితుడు అపార్ట్‌మెంట్‌కు వెళ్లగా.. లోపలి వాతావరణం చూసి కేకలు వేశాడు. అపార్ట్‌మెంట్‌లో బేకర్ చనిపోయినట్లు స్నేహితుడు కనుగొన్నాడు. ఆ తర్వాత క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు బేకర్ కుటుంబ సభ్యులను, స్నేహితులను ఓదార్చింది. క్లబ్ లేదా బోర్డు బేకర్ మరణంపై తదుపరి సమాచారం ఇవ్వలేదు. అతని క్లబ్ గోప్యత కోసం విజ్ఞప్తి చేసింది.
పాకిస్తానీ స్పిన్నర్, అతని స్నేహితుడు ఉసామా మీర్ కూడా బేకర్ మరణంతో షాక్ అయ్యారు . బేకర్ వార్త విని చాలా షాక్ అయ్యానని చెప్పాడు. అతను కలుసుకున్న మంచి వ్యక్తులలో బేకర్ ఒకరు. అతను తెలివైన క్రికెటర్. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ బేకర్ 22 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతని పేరిట 43 వికెట్లు ఉన్నాయి. 24 లిస్ట్ ఏ, టీ20 మ్యాచ్‌లలో అతని పేరు మీద 27 వికెట్లు ఉన్నాయి. జులై 2023లో, బేకర్ గ్లౌసెస్టర్‌షైర్‌పై 75 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇది అతని కెరీర్‌లో అతిపెద్ద ఇన్నింగ్స్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..