Women Cricketers Marriage: ఐదేళ్ల ప్రేమకు ఫుల్‌స్టాప్.. ఒక్కటైన ఇంగ్లండ్ మహిళా క్రికెటర్లు..
ఐదేళ్ల ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టారు. క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. ఐతే ఇక్కడ పెళ్లి చేసుకుంది ఇద్దరు లేడీస్. ఇంగ్లండ్‌కు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు. ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్లు కేథరిన్ బ్రంట్, నాట్ సీవర్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
England Women Cricketers Katherine Brunt and Natalie Sciver: ఇద్దరు మహిళలు ఒక్కటయ్యారు. ఇంగ్లండ్ జట్టుకు చెందిన ఇద్దరు మహిళా క్రికెటర్లు పెళ్లిచేసుకున్నారు. గత ఐదేళ్లుగా ప్రేమలో ఉన్న కేథరిన్ బ్రంట్, నటాలీ సీవర్.. క్రిస్టియన్ సంప్రదాయంలో మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్.. ఆఫీషియల్ ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. ఇంగ్లాండ్ మహిళా క్రికెట్‌లో కేథరిన్ బ్రంట్, నాట్ సీవర్ కీలకంగా మారారు. 2017 వరల్డ్ కప్ గెల్చుకున్న ఇంగ్లండ్ మహిళల టీమ్‌లో ఉన్న ఈ ఇద్దరూ.. ఇంగ్లాండ్‌కు ఆ ఏడాది ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించారు. 2018 నుంచి ఈ ఇద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారు. 2019లో ఈ జంట.. ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. 2020 లోనే కేథరన్-సీవర్ లు పెళ్లి చేసుకుందామని భావించారు. కానీ, కరోనా కారణంగా వీరి పెళ్లి వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం కొవిడ్ తగ్గడంతో ఈ ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు. క్రిస్టియన్ సంప్రదాయంలో జరిగిన వీరి పెళ్లికి ఇంగ్లాండ్ క్రికెటర్లు హాజరయ్యారు. 2022 వన్డే వరల్డ్ కప్‌లో రన్నర్‌గా నిలిచిన ఇంగ్లండ్ టీంలోనూ కేథరిన్, నటాలీ సభ్యులుగా ఉన్నారు.
న్యూజిలాండ్‌లో జరిగిన ఈ వరల్డ్ కప్‌లో సివర్ అద్భుతంగా రాణించింది. ఐతే ఇద్దరు మహిళలు పెళ్లి చేసుకోవడం క్రికెట్ ప్రపంచంలో ఇదే కొత్త కాదు. గతంలోనూ పలువురు మహిళా క్రికెటర్లు వివాహం చేసుకున్నారు. సౌతాఫ్రికాకు చెందిన మరిజాన్నే కాప్, డేన్ వాన్ నీకెర్క్ ఉంగరాలు మార్చుకోగా.. న్యూజిలాండ్‌కు చెందిన ఏమీ సట్టెర్త్‌వైట్, లీ తహుహు వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ ఇద్దరూ తమ వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నారు.
ఇద్దరు లేడీ క్రికెటర్లు పెళ్లి చేసుకోవడం ప్రపంచ క్రికెట్‌లో ఇదే మొదటిసారి కాదు. ఇంతకుముందు న్యూజిలాండ్ క్రికెటర్లు అమీ సటర్త్‌వైట్, లియా తహుహు కూడా ఇదే తరహాలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అలాగే దక్షిణాఫ్రికా ప్లేయర్లు మా రిజాన్ కాప్, డేన్ వాన్ నీకెర్క్ కూడా ఈ లిస్టులో ఉన్నారు.
Our warmest congratulations to Katherine Brunt & Nat Sciver who got married over the weekend ❤️ pic.twitter.com/8xgu7WxtFW
— England Cricket (@englandcricket) May 30, 2022