
కరాచీలోని నేషనల్ స్టేడియంలో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడో టెస్టు జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో మూడో రోజు జరిగిన ఓ సంఘటన అభిమానులను ఆకట్టుకుంది. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ హెడ్ కోచ్ చేసిన పని చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.. పాకిస్థాన్ రెండో ఇన్నింగ్స్ కొనసాగుతుండగా ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ కరాచీ స్టేడియంలోని 12 అడుగుల ఎత్తైన నెట్‌ను ఎక్కాడు. మెక్‌కలమ్‌కి సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంగ్లండ్ టెస్టు జట్టు కోచ్ ఎందుకు ఇలా చేశాడో ఇప్పుడు చూద్దాం.
ఓ ఫ్యాన్ టీ-షర్ట్ కోసం బ్రెండన్ మెకల్లమ్ ఇలా చేశాడు. బౌండరీ లైన్ వద్ద 12 ఎత్తైన ఫెన్సింగ్ నిర్మించాడు. దానిపై ఓ అభిమాని టీ-షర్టు ఇరుక్కుపోయింది. దానిని తీసేందుకు ఒ కర్రతో ప్రయత్నించారు. కానీ, అది ఫలించలేదు. ఇదంతా బౌండరీ లైన్ దగ్గర నిలబడి ఉన్న మెకల్లమ్ గమనించాడు. అభిమాని ప్రయత్నాలను గమనించిన మెకల్లమ్.. నేరుగా తానే వచ్చి ఫెన్సింగ్ ఎక్కాడు. అతి వేగంగా ఫెన్సింగ్ ఎక్కి పైన చిక్కిన టీ షర్ట్‌ను తీసి అభిమానులకు ఇచ్చేశాడు. మెకల్లమ్ చేసిన పనికి అభిమానులు ఆశ్చర్యపోయారు. 12 అడుగుల పొడవైన ఫెన్సింగ్ చాలా ఈజీగా పైకి ఎక్కడం చూసిన అభిమానులు షాక్ అయ్యారు.
క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన బ్రెండన్ మెకల్లమ్.. ఇంగ్లండ్‌కు కోచ్‌గా ఉన్నారు. అయితే, మెకల్లమ్ తన ఫిట్‌నెస్ విషయంలో ఏమాత్రం రాజీ నడటం లేదు. ఇటీవల మెకల్లమ్ సిక్స్ హిట్టింగ్ పోటీలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను ఓడించాడు. మెకల్లమ్ శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా స్ట్రాంగ్ ప్లేయర్.
22 ఏళ్ల తర్వాత ఇంగ్లండ్ జట్టు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టింది. జట్టులో మొదటిసారిగా పాకిస్తాన్‌కు వస్తున్న అనేక మంది కొత్త ఆటగాళ్లు ఉన్నారు. అయినప్పటికీ బాబర్ అండ్ టీమ్‌ను ఇంగ్లండ్ ఓడించింది. టెస్ట్ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు గెలవడంతో.. సిరీస్‌ను కైవసం చేసుకుంది. కరాచీ వేదిగా జరిగిన 3వ మ్యాచ్‌లోనూ ఇంగ్లండ్ గెలవడంతో క్లీన్ స్వీప్ చేసినట్లయ్యింది.
Did you think there’s anything Brendon McCullum can’t do?
We had a shirt mishap trying to throw it over a fence…
BAZ TO THE RESCUE ?♂️#PAKvENG pic.twitter.com/vxKDOOikwx
— England’s Barmy Army (@TheBarmyArmy) December 19, 2022
మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..